రేవంత్ రెడ్డికి కఠిన పరీక్ష..!!

Maharashtra Assembly elections 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి. జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తోన్నాయి. పోలింగ్ గడువు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్‌షోలు, బహిరంగ సభలతో హోరెత్తిపోతోంది మహారాష్ట్ర.

288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అదే నెల 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజున కౌంటింగ్‌ నిర్వహించనుంది ఈసీ. ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది తేలేది అప్పుడే.

Maharashtra elections 2024 Telangana CM Revanth Reddy campaign in these constituencies

మహాయుటి తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ సహా బీజేపీ సీనియర్లందరూ ప్రచారబరిలో దూకారు. మహా వికాస్ అగాఢీ నుంచి మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఉద్ధవ్ థాకరే హోరాహోరీ ప్రచారం సాగిస్తోన్నారు.

ఈ పరిణామాల మధ్య మహా వికాస్ అగాఢీ తరఫున ఎన్నికల ప్రచార బరిలో దిగారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలుగు ఓటర్లు పెద్ద సంఖ్యలో స్థిరపడిన జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలను నిర్వహించనున్నారు. మహా వికాస్ అగాఢీ అభ్యర్థులతో కలిసి ముమ్మర ప్రచారం సాగించనున్నారు.

ఈ ఉదయం ఆయన నాగ్‌పూర్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి చంద్రాపూర్‌కు చేరుకుంటారు. చంద్రాపూర్ నుంచి తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం రజూరా, దిగ్రాస్, వార్ధాల్లో రోడ్ షోల్లో పాల్గొంటారు. రాత్రికి నాగ్‌పూర్‌కు తిరిగి వస్తారు. అక్కడే బస చేస్తారు.

ఆదివారం ఉదయం 10 గంటలకు నాగ్‌పూర్ నుంచి నాందెడ్‌కు బయలుదేరి వెళ్తారు రేవంత్ రెడ్డి. నయాగావ్, భొకార్, షోలాపూర్‌లల్లో ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోల్లో పాల్గొంటారు. అక్కడ నివసిస్తోన్న తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్‌గా అపాయింట్ చేసింది కాంగ్రెస్ పార్టీ.

అలాగే- పార్టీ తరఫున ఎన్నికల అబ్జర్వర్లుగా నియమితులైన మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ రెండు రోజుల పాటు మహారాష్ట్రలోనే మకాం వేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు జార్ఖండ్ ఎన్నికల బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+