జడ్జికే వేధింపులు, ఫేస్ బుక్ ఖాతాలో అభ్యంతరకర పోస్టులు, చివరికిలా..

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:ఫేస్ బుక్ లో నకిలీ ఖాతాను సృష్టించి ఏకంగా జూనియర్ సివిల్ జడ్జిని వేధించిన కేసులో ఓ న్యాయవాదిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేశారు.

తన ఫేస్ బుక్ ఖాతాలో అభ్యంతరకర చిత్రాలను పోస్ట్ చేసినట్టు గుర్తించిన కొంపల్లిలో ఉండే జూనియర్ సివిల్ జడ్జి కొద్దిరోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.రామాంతపూర్ లోని ఓ ప్రైవేట్ సంస్థకు న్యాయ సలహాదారుగా ఉన్న మహేష్ అనే వ్యక్తి ఈ రకంగా వ్యవహరించాడని పోలీసులు గుర్తించారు.

2010లో సివిల్ జడ్జి వద్ద మహేష్ జూనియర్ గా పనిచేసేవాడు. అయితే జడ్జి కుటుంబ సభ్యుడిగా ఆయన మెలిగేవాడు.పిల్లలతోనూ ఆయన సాన్నిహిత్యాన్ని పెంచుకొన్నాడు.

black mailing

కొంతకాలం తర్వాత అతని ప్రవర్తన నచ్చక మహేష్ ను ఆమె దూరం పెట్టింది. అయితే ఆమెపై మహేష్ కక్షగట్టాడు.బెదిరింపులకు పాల్పడ్డాడు.

స్నానం చేస్తున్న దృశ్యాలు, పిల్లల అభ్యంతరకర ఫోటోలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తానంటూ నిందితుడు ఆమెను బెదిరించాడు.ఆమెపై బ్లాక్ మెయిల్ కు పాల్పడి పలు దఫాలు డబ్బులను తీసుకొన్నాడు.

ఆమె వద్ద తీసుకొన్న డబ్బుతోనే కారును కొనుగోలు చేశాడు.విలాసాలకు పాల్పడేవాడు. అయితే బాధితురాలి పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతాను ఓపెన్ చేసి అభ్యంతరకర చిత్రాలను అందులో అప్ లోడ్ చేశారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి కూకట్ పల్లి 16, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హజరుపర్చినట్టు పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
mahesh arrested for blackmailing on junior civil judge.she has complaint against him.police arrested mahesh on tuesday.
Please Wait while comments are loading...