• search

మహేష్ కత్తి ఆయన్నూ వదల్లేదు: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై మళ్లీ...

By Pratap
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: సినీ క్రిటిక్ మహేష్ కత్తి వ్యాఖ్యలకు విరామం ఉండడం లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనే కాకుండా తనకు దొరికినవారందరిపై ఫేసు‌బుక్‌లో వ్యాఖ్యలు చేస్తూ వివాదాలు సృష్టిస్తున్నారు.

   Mahesh Kathi Posted Cartoons Against Pawan Kalyan Goes Viral

   నో ఎండ్: పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపైనా మహేష్ కత్తి గురి

   గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి పనిచేసిన జిగ్నేష్ మేవానిపై కూడా ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దళిత రాజకీయాల గురించి మాట్లాడుతూనే ఆయనను ఎత్తిపొడిచారు.

   ఆ ఫొటో పెట్టి ఇలా కామెంట్..

   ఆ ఫొటో పెట్టి ఇలా కామెంట్..

   కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో కలిసి కూర్చున్న జిగ్నేష్‌ ఫొటోను పోస్టు చేస్తూ మహేష్ కత్తి వ్యాఖ్యలు పోస్టు చేశారు."లీడర్ అంటే దేవుడు. ఎవరో నాయకులకు ఊడిగం చెయ్యాలనేవి దళిత రాజకీయ పోకడలు కాబోవు. దళితులు ఆత్మగౌరవ పోరాటాలు చేసేది సమానత్వం కోసమేకానీ.. గెలిచి (నాయకుడి) పక్కన కూర్చుని చర్చించడానికి కాదు. ‘జీ హుజూర్.. అని జైకొట్టడానికి కానేకాదు" అని కత్తి మహేశ్‌ అన్నారు.

   మేవాని ఉద్యమం ఇలా..

   మేవాని ఉద్యమం ఇలా..


   గుజరాత్ ఉనా గుజరాత్‌ దళిత ఉద్యమంతో జిగ్నేష్ మేవాని యువనాయకుడిగా ముందుకు వచ్చి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇటీవలి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వడ్గాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెసు పార్టీకి మద్దతు ఇచ్చారు.

   వేణు స్వామి ఇలా..

   వేణు స్వామి ఇలా..

   "పసలేని జ్యోతిష్యుడిగా వేణు స్వామి లైవ్ లో దొరికిపోయాడు. అసలు, జ్యోతిష్యమనేది శాస్త్రబద్దం కాదు అని బాబు గోగినేని నిరూపించారు. సరిపోయింది. ఈ ఉదంతం వల్ల హిందూ మతానికి వారిన బీటలు ఏమిటి? ఒక మానవవాదిగా బాబు గోగినేని మతాన్ని నమ్మకపోయినంత మాత్రాన, అది మత ద్రోహం ఎలా అవుతుంది? నిజానికి ఇది మోసం నుంచీ మనుషుల్ని రక్షించే సేవేగానీ!!!" అని మహేష్ కత్తి అన్నారు. 2017లో స్పూర్తినిచ్చినవారిగా ఆయన సూరేపల్లి సుజాతను, బాబు గోగినేని పేర్కొన్నారు.

   పవన్ ఫ్యాన్స్‌పై మళ్లీ..

   పవన్ ఫ్యాన్స్‌పై మళ్లీ..

   "మమ్ముట్టి ఉన్మాదపు అభిమానులకు తగిన శాస్తి జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు మిగిలారు" అని పార్వతి కుట్టి ఉదంతానికి సంబంధించిన వార్తా లింక్‌ను పోస్టు చేసి వ్యాఖ్యానిస్తూ పవన్ కల్యాణ్ అభిమానులపై విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్‌పై కూడా విసుర్లు విసిరారు. "డబ్బులేదు డబ్బులేదు అని బీదఅరుపులు అరుస్తుంటాడు. మళ్ళీ ఫోర్బ్స్ రిచ్ లిస్టులో ఉంటాడు. ఇంతకీ ఇతడి ఆదాయం ఎంత? సినిమాల్లోంచి వచేది ఎంత? పై ఆదాయం ఎంత? ఎక్కడి నుంచీ?" అని మరో పోస్టు పెట్టారు.

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   Cine critic Mahesh made target Gujarat Dalit leader jignesh Mevani this time in his Facebook comments.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   Notification Settings X
   Time Settings
   Done
   Clear Notification X
   Do you want to clear all the notifications from your inbox?
   Settings X
   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more