రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీ.. పూర్తి లిస్టు ఇదే..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. భారీగా ఐపీఎస్ (IPS)​ అధికారులను బదిలీ చేసింది. మొత్తం 32 మంది అధికారులను బదిలీ చేస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 1997 బ్యాచ్​ కు చెందిన IPS అధికారి​ దేవేంద్ర సింగ్ చౌహాన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (పర్సనల్) గా బదిలీ అయ్యారు. అలాగ హైదరాబాద్​ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పని చేస్తున్న 2009 బ్యాచ్ కు చెందిన పరిమిళా నూతన్ సీఐడీ డిప్యూటీ ఇన్‌ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్​ గా నియమితులయ్యారు.

Major Reshuffle in Telangana Police 32 IPS Officers Transferred in One Go

తెలంగాణలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు మొత్తం 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏడీజీ పర్సనల్‌ గా దేవేంద్ర సింగ్ చౌహాన్ బదిలీ అయ్యారు. అలాగే.. సీఐడీ డీఐజీగా పరిమిళా నూతన్ బదిలీ అయ్యారు. రాచకొండ క్రైమ్స్ డీసీపీగా గుణశేఖర్ బదిలీ అయ్యారు.

బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల వివరాలు ఓసారి చూస్తే.. టీజీ ట్రాన్స్ కో ఎస్పీగా శ్రీనివాస్, రాచకొండ క్రైమ్స్ డీసీపీగా గుణ శేఖర్, పోలీస్ అకాడమి డిప్యూటీ డైరెక్టర్ గా ఎమ్. చేతన, మల్కాజ్ గిరి డీసీపీగా శ్రీధర్, నాగర్ కర్నూల్ ఎస్పీగా సంగ్రమ్ సింగ్, వికారాబాద్ ఎస్పీగా స్నేహ మెహరా, నార్కోటిక్స్ ఎస్పీగా పద్మ, మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డి, టాస్క్ ఫోర్స్ డీసీపీగా వైభవ్ గైక్వాడ్, ములుగు ఎస్పీగా సుధీర్, భూపాలపల్లి ఎస్పీగా సంకేత్, .. తదితరులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+