కేసీఆర్‌కు అల్లుడి టెన్షన్! హరీష్‌ను మంత్రి చేశాకే కాళేశ్వరం ప్రారంభించాలంటూ అభిమానుల పేరిట లేఖ

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు జూన్ 21వ తేదీన ప్రారంభోత్సవం జరగనుంది. ఇక ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అహర్నిశలు కృషి చేసిన హరీష్ రావు కు మంత్రి పదవి ఇవ్వాలని హరీష్ అభిమానుల నుండి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది.

 కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ ముందు కొత్త డిమాండ్

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ ముందు కొత్త డిమాండ్

కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అహర్నిశలు కృషి చేసి, రాత్రనకా పగలనకా శ్రమించిన శ్రామికుడు అయిన హరీష్ రావు ను నీటి పారుదల శాఖ మంత్రిగా ప్రకటించి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ ఓ లేఖ ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం హరీష్ రావ్ ఎంతగా కృషి చేశాడో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజు హరీష్ రావు లేకుంటే అది లోటుగానే ఉంటుందని భావించిన హరీష్ అభిమానులు ఇప్పుడు కేసీఆర్ ముందు ఒక కొత్త డిమాండ్ పెట్టారు.

హరీష్ కు భారీ నీటి పారుదల శాఖా మంత్రిగా అవకాశం ఇవ్వాలని అభిమానుల నుండి డిమాండ్

హరీష్ కు భారీ నీటి పారుదల శాఖా మంత్రిగా అవకాశం ఇవ్వాలని అభిమానుల నుండి డిమాండ్


హరీష్ రావుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి గా అవకాశం ఇచ్చి మంత్రి హోదాలో ఆయనకు సముచిత స్థానం ఇవ్వాలని వారు కోరుతున్నారు. అందులో భాగంగా రాసిన లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు.

త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మీ నాయకత్వంలో చరిత్రలో నిలిచిపోయే ఎన్నో ప్రాజెక్టులు, పథకాలు రూపొందించారు. దీనిలో భాగంగా మన టాగ్ లైన్ నీళ్ళు , నిధులు,నియామకాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి మీ మదిలో నుండి వచ్చినదే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక భారీ నీటి పారుదల శాఖ ను మీరు కేటాయించి తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలరంగాన్ని హరీష్ రావు గారికి మీరుఅప్పచెప్పిన గురుతర బాద్యత లను భుజాలపై వేసుకుని భారత దేశ చరిత్రలోనే అత్యంత వేగంగా రికార్డ్ స్థాయిలో పని పూర్తి చేసుకోవడానికి హరీష్ రావు గారు రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఓ శ్రమికుడి లాగా శ్రమించిన సంఘటనలు తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని ఆ లేఖలో పేర్కొన్నారు.

మంత్రి హోదాలో కాళేశ్వరం ప్రారంభోత్సవానికి హరీష్ ను ఆహ్వానించాలని లేఖ .. సోషల్ మీడియాలో వైరల్

మంత్రి హోదాలో కాళేశ్వరం ప్రారంభోత్సవానికి హరీష్ ను ఆహ్వానించాలని లేఖ .. సోషల్ మీడియాలో వైరల్

ఈ నెల 21 వ తేదీన మీరు తల పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికిమహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో పాటు మీ కుడి భుజం గా, ఆపద సమయాల్లో మీ వెన్నంటి నడిచిన కార్యకర్తగా,కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించడానికి మీరు చేసిన ఆలోచనలను తూచా తప్పకుండా పాటించి, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి శ్రమించిన వ్యక్తిగా హరీశ్ రావు గారికి నీటి పారుదల శాఖను కేటాయించి మంత్రి హోదాలో కాళేశ్వరంప్రాజెక్టును ప్రారంభించడానికి ఆహ్వానించాల్సిందిగా మా విన్నపము అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ఇక ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ముఖ్యమంత్రి హరీష్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+