అక్కా అంటూనే.. పోర్న్ భంగిమల్లో ఫోటోల్ని!: అభిషేక్ గౌడ్ ద్విపాత్రాభినయం? అసలు రంగు ఇదీ!

తొలుత అక్కా అంటూ పరిచయం చేసుకున్న యువతినే.. ఆపై అసభ్యంగా వేధించడం మొదలుపెట్టాడు. సోషల్ మీడియా ద్వారా ఆమె ఫోటోలు సంపాదించి.. మార్ఫింగ్ ద్వారా పోర్న్ స్టార్‌లా తయారుచేశాడు.

హైదరాబాద్: సోషల్ మీడియా ఎంట్రీ తర్వాత మనుషుల జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. కమ్యూనికేషన్ ఎంతగా విస్తరించిందో.. దాని మాటున నేరాలకు పాల్పడేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. తాజాగా హైదరాబాద్ లో వెలుగుచూసిన టీఆర్ఎస్ కార్పోరేటర్ కొడుకు అభిషేక్ గౌడ్ లీలలు ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయి.

చిన్న నాటి స్నేహితులు.. హైస్కూల్ మిత్రులు.. ఇలా అమ్మాయి ఎవరైనా సరే, వారి నంబర్ సంపాదించడం.. పరిచయం పెంచుకోవడం అభిషేక్‌కు అలవాటు. ఒక్కసారి వారు మాట్లాడటం మొదలుపెడితే చాలు.. ఇక తన అసలు రూపం బయటపెడుతాడు. అశ్లీల మెసేజ్ లతో వేధిస్తుంటాడు. పోలీసుల విచారణలో అభిషేక్ గౌడ్ చేసిన నిర్వాకానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

అక్కా అంటూనే:

అక్కా అంటూనే:

'అక్కా బాగున్నావా?.. చిన్నప్పుడు మనం కలిసి చదువుకున్నాం గుర్తుందా?.. ప్రస్తుతం హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదువుతున్నా.. మనం ఒకసారి కలుద్దాం అక్కా.. మీరిప్పుడు ఉన్నత స్థాయిలో సెటిల్ అయి ఉంటారు. అప్పుడప్పుడూ ఫోన్‌ చేస్తుంటానక్కా.. మీకేమైనా పనులు కావాలంటే చెప్పండి, చేసి పెడుతా.. పెళ్లిళ్లప్పుడు కలుసుకుంటూ ఉందాం'..

ఇదీ అభిషేక్ గౌడ్ ఓ యువతికి పంపించిన మెసేజ్. స్నేహితుల ద్వారా ఆమె నంబర్ సంపాదించిన అభిషేక్.. మెల్లిగా ఆమెతో పరిచయం పెంచుకోవడం మొదలుపెట్టాడు. అలా కొద్దిరోజులు గడిచాక.. అభిషేక్ గౌడ్ అసలు రూపం బయటపడింది.

ఇదీ అసలు రూపం:

ఇదీ అసలు రూపం:

తొలుత అక్కా అంటూ పరిచయం చేసుకున్న యువతినే.. ఆపై అసభ్యంగా వేధించడం మొదలుపెట్టాడు. సోషల్ మీడియా ద్వారా ఆమె ఫోటోలు సంపాదించి.. మార్ఫింగ్ ద్వారా పోర్న్ స్టార్‌లా తయారుచేశాడు. తనతో మాట్లాడకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు.

పోలీసులకు ఫిర్యాదు చేసినా.. మార్ఫింగ్ వీడియోలను ఇంటర్నెట్ లో పెడుతానని హెచ్చరించాడు. వివిధ భంగిమల్లో నీ ఫోటోలను పోర్న్ స్టార్‌లా మార్ఫింగ్ చేసి అందరికీ పంపిస్తానని బెదిరించేవాడు.
తాజా పోలీసుల విచారణలో ఈ విషయాలు బయటపడ్డాయి. అక్కా అంటూ మాట్లాడిన వ్యక్తే ఇలా చేసేసరికి సదరు యువతి దిగ్భ్రాంతికి లోనైనట్లు తెలుస్తోంది.

బాధితులతో ద్విపాత్రాభినయం:

బాధితులతో ద్విపాత్రాభినయం:

సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి చెందిన డాక్టర్ కూతురు, ఒక ప్రైవేట్ ఉద్యోగి కుమార్తె, చిత్తూరు జిల్లాకు చెందిన మరో యువతి.. వీరు కాకుండా మరో 10మంది అభిషేక్ గౌడ్ బారిన పడ్డారు. అంతేకాదు.. వేధిస్తున్న తానే అని తెలియకుండా ఉండేందుకు.. ద్విపాత్రాభినయం చేసి మరీ వారికి అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు.

వైద్య నిపుణుడి కూతురితో తరుచూ చాట్ చేసే అభిషేక్ గౌడ్.. మరో నంబర్ నుంచి మార్ఫింగ్ ఫోటోలను ఆమె మొబైల్ కు పంపించేవాడు. ఇద్దరూ ఒకరే అని తెలియని బాధితురాలు.. తిరిగి అభిషేక్ గౌడ్ కే విషయం చెప్పేది. దాంతో ఆమె ముందు వారికి ఫోన్ చేసి బెదిరించినట్లు అభిషేక్ గౌడ్ నటించేవాడు. అలా ద్విపాత్రాభినయాన్ని రక్తి కట్టించి మరీ తన మీద అనుమానం రాకుండా చేసుకున్నాడు.

ప్రతీసారి కొత్త సిమ్:

ప్రతీసారి కొత్త సిమ్:

ఎప్పటికప్పుడు కొత్త సిమ్ కార్డులు సంపాదించడం.. అమ్మాయిల నంబర్లు సేకరించడం అభిషేక్ గౌడ్ కు అలవాటు. ఆపై సదరు అమ్మాయిలతో 'అక్కా..' అంటూ మాటలు కలిపి.. చివరకు వారిని వేధించడం అతని టార్గెట్. ఏదైనా కొత్త నంబర్ దొరకగానే.. 'అక్కా బాగున్నారా?' అంటూ మెసేజ్ చేస్తాడు. వారి నుంచి బదులు రాగానే.. మాటల్లో పెట్టే ప్రయత్నం చేస్తాడు.

ఇక మరుసటి రోజు సోషల్ మీడియా నుంచి వారి ఫోటోలు, వీడియోలు సేకరించి అశ్లీలంగా మార్ఫింగ్ చేస్తాడు. వేర్వేరు నంబర్ల నుంచి ఆ ఫోటోల్ని వారికి పంపించి.. వేధింపులకు దిగుతాడు. తనతో మాట్లాడకపోతే యూట్యూబ్ లో పెడుతానంటూ హెచ్చరిస్తాడు.

ప్రతీసారి కొత్త సిమ్ కార్డు వాడుతుండటంతో పోలీసులు అభిషేక్ గౌడ్ ఆచూకీ కనిపెట్టలేకపోయారు. కేసును ఎస్ఐ శశిధర్ కు అప్పగించాక కానీ అతని ఆచూకీ తేలలేదు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆయా ఫోన్ నంబర్లపై నిఘా ఉంచి.. లొకేషన్ చేధించగలిగారు. అలా అభిషేక్ గౌడ్ ఆచూకీ దొరికింది.

రంగంలోకి కార్పోరేటర్..:

రంగంలోకి కార్పోరేటర్..:

కేసులో అభిషేక్ చుట్టు ఉచ్చు బిగిస్తుండటంతో అతని తండ్రి, మల్కాజ్ గిరి కార్పోరేటర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తనయుడిని కేసు నుంచి తప్పించేందుకు పైరవీలు మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. అంతేకాదు, బాధితులు కేసులు ఉపసంహరించుకునేలా అతను ప్రభావితం చేస్తుండటంతో.. యువతుల కుటుంబాలు సైతం వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. కోర్టులు, పోలీసుల చుట్టూ తాము తిరగలేమని ఓ బాధిత యువతి కుటుంబం వాపోయినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+