రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తనదైన శైలిలో మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పాలిటిక్స్ నుంచి సినిమాల వరకు మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో తనకున్న అనుబంధంపై మల్లారెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అసెంబ్లీ వద్ద మీడియా చిట్‌చాట్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

రెడ్డి సంఘం మీటింగ్‌లో ఆనాడు తాను చేసిన వ్యాఖ్యలను మల్లారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రెడ్డి సామాజికవర్గంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి తప్ప మరో పవర్‌ఫుల్ నాయకుడు లేడని ఆనాడే తాను చెప్పానని ఆయన వెల్లడించారు. "రెడ్డి సంఘం మీటింగ్‌లో నేను స్పష్టంగా చెప్పాను.. మన సామాజిక వర్గంలో రేవంత్ రెడ్డి అత్యంత శక్తివంతమైన నేత అని. ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాను, చివరకు అది నిజమైంది. ఒక రకంగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే" అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

Malla Reddy Sensational Comments on Relationship with Telangana CM Says I Made Revanth Reddy CM

రేవంత్.. నేను అన్నదమ్ములమే..
రాజకీయంగా విమర్శలు ఉన్నప్పటికీ.. రేవంత్ రెడ్డితో తనకున్న వ్యక్తిగత అనుబంధం గురించి మల్లారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "ఎవరు అవునన్నా కాదన్నా.. నేను, రేవంత్ రెడ్డి అన్నదమ్ములమే. మా మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. రాజకీయాలు వేరు, బంధాలు వేరు" అని ఆయన స్పష్టం చేశారు. గతంలో రేవంత్ రెడ్డి మల్లారెడ్డి కాలేజీలపై జరిగిన దాడులు, భూ వివాదాల నేపథ్యంలో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మల్లారెడ్డి రేవంత్‌ను తన సోదరుడిగా పేర్కొనడం చర్చనీయాంశమైంది.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ క్యారెక్టర్ నాదే..
రాజకీయాలతో పాటు సినీ రంగంపై కూడా మల్లారెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో తనకు విలన్ పాత్ర ఆఫర్ వచ్చిందని మల్లారెడ్డి వెల్లడించారు. " ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ క్యారెక్టర్ నాదే..దర్శకుడు హరీష్ శంకర్ అడిగితే నేను నో చెప్పాను..సినిమాల్లో ముఖ్యమంత్రి పాత్ర చేయాలని ఉంది.." అని మల్లారెడ్డి తెలిపారు.

ముఖ్యమంత్రి పాత్ర చేయాలని ఉంది!
సినిమాల్లో నటించడంపై తనకు ఆసక్తి ఉందని, అయితే తనకు నచ్చిన పాత్ర వస్తేనే చేస్తానని మల్లారెడ్డి పేర్కొన్నారు. "నాకు సినిమాల్లో ముఖ్యమంత్రి పాత్ర చేయాలని ఉంది. రియల్ లైఫ్‌లో కాకపోయినా, రీల్ లైఫ్‌లోనైనా సీఎం హోదాలో కనిపించాలని ఆశపడుతున్నాను. అలాంటి పవర్‌ఫుల్ పాత్ర వస్తే తప్పకుండా నటిస్తాను" అని మల్లారెడ్డి తన కోరికను బయటపెట్టారు. మల్లారెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+