మొత్తానికి సాధించారు.. మంత్రి వర్గ విస్తరణ వేళ వివేక్ తో మల్లారెడ్డి సరదా సంభాషణ
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ పైన ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణ పైన ప్రచారం జరుగుతున్న వేళ ఎట్టకేలకు త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేయడానికి ముహూర్తం ఖరారైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6 మంత్రి పదవులు ఖాళీ ఉండగా ఎవరెవరికి ఇవ్వాలి అన్న విషయం పైన అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
మంత్రి వర్గ విస్తరణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సంభాషణ
అన్ని సామాజిక వర్గాలకు సమానమైన ప్రాధాన్యతను కల్పిస్తూ మంత్రివర్గంలో స్థానం కేటాయించాలని భావించినట్లు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు బీసీలకు, ఒక రెడ్డి సామాజిక వర్గానికి, ఒక ముస్లిం సామాజిక వర్గానికి, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి మంత్రులుగా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది. అయితే ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయ వర్గాలలో కూడా ఆసక్తికర సంభాషణలు చోటుచేసుకుంటున్నాయి.

మొత్తానికి సాధించారు అంటూ వివేక్ తో మల్లారెడ్డి వ్యాఖ్యలు
నేడు తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర విషయం పైన చర్చ జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిని బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి పలకరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన గడ్డం వివేక్ వెంకటస్వామి తో సరదా సంభాషణ చేశారు. వివేక్ వెంకటస్వామి తో మాట్లాడిన మల్లారెడ్డి మొత్తానికి సాధించారు.. సీఎం, డిప్యూటీ సీఎం కంటే ముందే ఢిల్లీ వచ్చారు అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యలు చేశారు.
వివేక్, కోమటిరెడ్డి కుటుంబాల హడావుడి మాత్రమే నడుస్తోందని చలోక్తులు
అందుకు వివేక్ వెంకటస్వామి లేదు.. నేను వేరే పని మీద వెళ్లాను అంటూ సమాధానం ఇచ్చారు. ఇక ఆయన మాటలను వింటున్న మల్లారెడ్డి పట్టించుకోనట్టే మాట్లాడుతూ రాష్ట్రంలో వివేక్, కోమటిరెడ్డి కుటుంబాల హడావుడి మాత్రమే నడుస్తోంది అంటూ చలోక్తులు విసిరారు. ఇక ఆ మాటకు వివేక్ వెంకటస్వామి నవ్వుతూ కెసిఆర్, మల్లారెడ్డి కుటుంబాలది కూడా నడుస్తుంది కదా అంటూ రివర్స్ పంచ్ వేశారు.
వివేక్ మంత్రి పదవి పక్కా.. మల్లారెడ్డి చెప్పిందిదే
మల్లారెడ్డి ఇప్పుడు మాది నడవడం లేదు, అంతా మీ రాజ్యమే అంటూ వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఈ ఆసక్తికర సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివేక్ మంత్రి పదవి పక్కా అని మల్లారెడ్డి వ్యాఖ్యలతో తాజాగా అందరికీ అర్ధం అయ్యింది.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications