ఆ ఎయిర్ పోర్ట్ నిర్మాణం ఇక జెట్ స్పీడ్ లో.. తీపికబురు!
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది నిజాం కాలంలో స్థాపించబడిన చారిత్రక విమానాశ్రయము తిరిగి అభివృద్ధి చేసి దేశీయ విమాన సేవలను దళిత ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఉడాన్ పథకం కింద ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా మామునూరు ఎయిర్ పోర్టును నిర్మించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. దీనికి సంబంధించి ప్రస్తుతం కీలక అడుగు పడింది.
మామునూరు ఎయిర్ పోర్ట్ కు పూర్తయిన భూసేకరణ
మామునుర్ ఎయిర్‌పోర్ట్ భూ సేకరణ సకాలంలో విజయవంతంగా పూర్తి చేశారు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద. ఇక ఇటీవల హన్మకొండ లో జరిగిన సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ తరఫున రాష్ట్ర ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదను ఈ క్రమంలో అభినందించారు. యుద్ధ ప్రాతిపదికన మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ పనులు పూర్తి చేశారన్నారు.

భూసేకరణకు నిరంతరం శ్రమించిన వరంగల్ కలెక్టర్
భూమిని ఎయిర్పోర్ట్ అథారిటీకి అందిస్తే నిర్మాణ పనులు మొదలవుతాయని ఆయన పేర్కొన్నారు. మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ కోసం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మామునూరు పరిసర గ్రామాల భూ నిర్వాసితుల విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఆర్బిట్రేషన్ నిర్వహించారు. గాడి పల్లి, గుంటూరు పల్లి, నక్కలపల్లి గ్రామాల నుండి భూములను సేకరించిన కలెక్టర్ 696 ఎకరాల భూమిని సేకరించారు.
కలెక్టర్ ను సన్మానించిన రెవెన్యూ అధికారులు
ఈ క్రమంలో తాజాగా జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో వరంగల్, నర్సంపేట ఆర్‌డిఓలు సుమ, ఉమారాణి లతో పాటు జిల్లాలోని తాసిల్దారులు, రెవెన్యూ శాఖ అధికారులు జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ కోసం చేసిన విశేష కృషికి కలెక్టర్ ను సత్కరించారు.ఈ సందర్భంగా పలువురు అధికారులు ఈ ప్రాజెక్ట్ జిల్లా అభివృద్ధికి, ఉపాధి అవకాశాల కల్పనకు కీలకంగా నిలవనుందని వారు అభిప్రాయపడ్డారు.
త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్న కలెక్టర్
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ, ఎయిర్‌పోర్ట్ భూ సేకరణ ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సమయానికి పూర్తి చేయడంలో రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని, భూ సేకరణ ప్రక్రియలో సహకరించిన రైతులు, రెవెన్యూ అధికారులు, ఇతర శాఖల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే భూ సేకరణ ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలోనే విమానాశ్రయం పనులు మొదలవుతాయని వరంగల్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications