నెట్‌లో వీడియోలు: భారతమాతను కించపర్చిన బ్రదర్ విజయ్ అరెస్ట్
హైదరాబాద్: భారతమాతను కించపరుస్తూ ప్రసంగించడంతోపాటు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన క్రైస్తవ సంఘం డైరెక్టర్ బ్రదర్ విజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని దక్షిణ మండలం పోలీసు బృందం, టాస్క్‌ఫోర్స్ లీసులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు.

భారతమాతను కించపరుస్తూ..
సోమవారం మీడియాకు సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ వెల్లడించారు. క్రైస్తవ మతప్రచారకుడు యలమంచిలి విజయ్‌కుమార్ అలియాస్ బ్రదర్ విజయ్(36) భారతమాతను కించపరుస్తూ ప్రసంగించాడు.

ఫిర్యాదు అందడంతో..
అంతేగాక, ఆ ప్రసంగ వీడియోను యూట్యూబ్, సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశాడని పాతబస్తీ హుస్సేనిఆలం ప్రాంతానికి చెందిన వ్యాపారి టి కునాల్‌రావు డిసెంబర్ 7న హుస్సేనిఆలం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఏపీకి చెందిన క్రైస్తవ మతప్రచారకుడు
విజయ్ ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం రావులపాడుకి చెందినవాడని, నగరంలోని కొత్తపేటవద్ద క్రైస్ట్ చర్చిలో నివాసముంటున్నట్లు గుర్తించామని డీసీపీ తెలిపారు.

మారుపేర్లతో తిరుగుతూ..
మారుపేర్లతో తిరుగుతుండగా అరెస్టు చేసినట్లు డీసీపీ సత్యనారాయణ చెప్పారు. నిందితుడిపై 153-ఏ, 153-బీ, 295-ఏ ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామని వెల్లడించారు.
-
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ












Click it and Unblock the Notifications