పానీపూరీ అమ్మి.. జర్నలిస్ట్‌కు హీరో విష్ణు రూ.22 లక్షల సాయం
హైదరాబాద్: రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ గ్రేట్ హీరో అనిపించుకున్నాడు నటుడు మంచువిష్ణు. పక్షవాతానికిగురైన ఓ నిరుపేద జర్నలిస్టు జీవితానికి కొత్త ఆశలు చిగురింప చేశాడు. జర్నలిస్టు దుర్గాగౌడ్ హెల్త్ కోసం సహాయం చేశాడు.
ఆయన పిల్లలను చదివించేందుకు రూ.22 లక్షలను ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఏడాది కాలంగా పక్షవాతంతో మంచం పట్టి చావుబతులకులతో పోరాడుతున్న జర్నలిస్టు దుర్గాగౌడ్ కష్టాలను చూపుతూ మేముసైతం కార్యక్రమం తెర పైకి తెచ్చింది.
ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నమంచు విష్ణు.. బాధిత జర్నలిస్టు కష్టాలను విని కదిలిపోయాడు. ఒక్క
రోజు పానీపూరి అమ్మి తన వంతుగా 75,000 రూపాయలు సంపాదించాడు. వాటిని జర్నలిస్టు దుర్గా ఆరోగ్యం కోసం ఇచ్చారు.

ఆయన పిల్లలిద్దరికి నర్సరీ నుంచి ఇంటర్ వరకు కార్పోరేట్ విద్య అందించేందుకు 22 లక్షల ఇస్తానని చెప్పాడు. దీంతో విష్ణు పైన ప్రశంసల వర్షం కురుస్తోంది. నిజ జీవితంలోనూ గ్రేట్ హీరో అనిపించుకున్న మంచు విష్ణుకు జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.
మంచులక్ష్మి కూడా తనవంతుగా లక్ష రూపాయల సహాయం ప్రకటించింది. మొత్తం 1 లక్షా 75 వేల రూపాయల చెక్కును దుర్గాగౌడ్ కుటుంబానికి అందించారు.
అంటే దాదాపుగా 24 లక్షల రూపాయల సహాయం అందించిన మంచు విష్ణు, మంచు లక్ష్మిలకు హ్యాట్సాప్ చెబుతున్నారు. దొంగాట మూవీ డైరెక్టర్ వంశీకృష్ణకు జర్నలిస్డటులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జర్నలిస్టు దుర్గా జీవితానికి భరోసా అందించేందుకు సహాయ పడుతున్న ప్రతి ఒక్కరికి స్వామి ముద్దం కృతజ్ఞతలు చెప్పారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications