ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు: భార్య, అత్తను రక్తం వచ్చేలా కొట్టిన ఎస్ఐ(వీడియో)

Recommended Video

    భార్య, అత్తను రక్తం వచ్చేలా కొట్టిన ఎస్ఐ(వీడియో)

    భద్రాద్రికొత్తగూడెం: తనను ఎందుకు దూరం పెడుతున్నావంటూ ప్రశ్నించినందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య రక్తం వచ్చేలా కొట్టాడు ఓ దుర్మార్గపు భర్త. అంతేగాక, ఆమె తల్లిని కూడా తీవ్రంగా చితకబాదాడు. దీంతో ఆమె సొమ్మసిల్లిపడిపోయింది. కాగా, ఆ వ్యక్తి ఎంతో బాధ్యత గల పోలీసు విభాగంలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుండటం గమనార్హం. ఆయనే మణుగూరు ఎస్ఐ సముద్రాల జితేందర్.

     ప్రేమించి పెళ్లి.. వారానికే వేధింపులు...

    ప్రేమించి పెళ్లి.. వారానికే వేధింపులు...

    బాధితురాలు, జితేందర్ భార్య పర్వీన్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ మొగిళ్లపాడు గ్రామానికి చెందిన ఎస్సై జితేందర్ 2015లో వెంకటాపురంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో పాల్వంచకు చెందిన పర్వీన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, పెళ్లయిన వారం రోజుల నుంచే ఆమెను వేధింపులకు గురిచేశాడు.

     అబార్షన్ చేయించి.. రూ.50లక్షల డిమాండ్

    అబార్షన్ చేయించి.. రూ.50లక్షల డిమాండ్

    అంతేగాక, వేధింపుల గురించి ఎవరికీ చెప్పవద్దని ఆమెను బెదిరింపులకు గురిచేసేవాడు. పెళ్లయిన కొన్ని రోజులకు మొదటిసారి గర్భం దాల్చిన పర్వీన్‌కు అబార్షన్ చేయించాడు. చింతకాని నుంచి కొత్తగూడెంకు బదిలీ అయిన సమయంలో పుట్టింటికి వెళ్లమని పంపించాడు. ఆ తర్వాత కొత్తగూడెంలోని ఓ అధికారి ఇంటికి పిలిపించి రూ.50లక్షలు కావాలని డిమాండ్ చేశాడు జితేందర్.

    కన్న కొడుకును కూడా చూడలేదు..

    కన్న కొడుకును కూడా చూడలేదు..

    రెండోసారి గర్భం దాల్చిన సమయంలో మళ్లీ అబార్షన్ చేయించుకోమని వేధించాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో ఏడాదిగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. పర్వీన్ ఫోన్ చేసినా స్పందించేవాడు కాదు. పది నెలల కిందట కుమారుడు జన్మించినా ఇప్పటివరకు బాబును ఒక్కసారి కూడా చూడలేదు. అంతేగాక, విడాకులు కావాలంటూ ఆమెను వేధించాడు.

     మరో మహిళతో వివాహేతర సంబంధం

    మరో మహిళతో వివాహేతర సంబంధం

    ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లే తనను దూరంగా ఉంచుతున్నాడని, ఈ విషయంపై బంధువులు జితేందర్‌ను నిలదీయగా వారిపై దాడికి దిగాడని పర్వీన్ కన్నీటిపర్యంతమయ్యారు.

    భార్య, అత్తను చితకబాదిన ఎస్ఐ

    గురువారం మణుగూరులో ఎస్సై జితేందర్ నివాసానికి పర్వీన్, అత్తా తహెరా వెళ్లి నిలదీశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన జితేందర్.. పర్వీన్, తహెరాను తీవ్రంగా కొట్టాడు. దీంతో పర్వీన్, తహెరాకు తీవ్రగాయాలయ్యాయి. ఆ తర్వాత జితేందర్ అక్కడ్నుంచి బ్యాగ్ తీసుకొని వెళ్లిపోయాడు. ఈ మేరకు మణుగూరు సీఐ కొండ్ర శ్రీనివాస్‌కు ఫర్వీన్ ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జితేందర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ సాయిబాబా తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+