'గౌతమీపుత్ర శాతకర్ణి' అంతా అబద్దం: తెలంగాణ లీడర్స్ ఆగ్రహం
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో చాలా అవాస్తవాలు ఉన్నాయని తెలంగాణ అసోసియేషన్ నాయకులు, పలువురు చరిత్రకారులు చెబుతున్నారు.
హైదరాబాద్: క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ-శ్రియ నటీనటులుగా వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో చాలా అవాస్తవాలు ఉన్నాయని తెలంగాణ అసోసియేషన్ నాయకులు, పలువురు చరిత్రకారులు చెబుతున్నారు.

చారిత్రక అబద్దం
కెప్టెన్ పాండురంగా రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఈ సినిమా ఓ చారిత్రక అబద్దం అని విమర్శించారు. అవాస్తవాలతో సినిమాలు తీయడం సరికాదన్నారు.

అవాస్తవాలతో సినిమా
అవాస్తవాలతో సినిమా తీశారని కాబట్టి ఈ సినిమాకు ఇచ్చిన వినోదపు పన్ను మినహాయింపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది హిస్టారికల్ సినిమా అని వారు చెప్పుకోవచ్చునని, కానీ ఆ సినిమా కల్పితమని చెప్పారు. శాతకర్ణి చారిత్రక అబద్దమని, అవాస్తవాలు, కల్పిత కథతో చిత్రాన్ని తెరకెక్కించారన్నారు.

ఆగ్రహం
కెప్టెన్ ఎల్ పాండురంగారెడ్డి (వాయిస్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు), హైదరాబాద్ డక్కెన్ డెమోక్రటిక్ అలయన్స్ అధ్యక్షుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి, తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ప్రతినిధి డీపీ రెడ్డిలు హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొత్త తరానికి అవాస్తవాలు
గౌతమిపుత్రుని చరిత్ర గురించి కొత్త తరానికి అవాస్తవాలు చెప్పారని మండిపడ్డారు. శాతకర్ణి అసలు కోటి లింగాలలో పుట్టనేలేదని, ఆయన తల్లి బాలాశ్రీ వేయించిన శాసనాల్లో ఈ విషయం లేదని వాళ్లు చెబుతున్నారు.

తెలంగాణ వ్యక్తి కాదు
కేవలం దక్కన్ పీఠభూమిని మాత్రమే పాలించిన శాతకర్ణి, దేశమంతటినీ పాలించినట్టు ఎలా చూపెడతారని నిలదీస్తున్నారు. శాతకర్ణి తెలంగాణ వ్యక్తి కాదని చెప్పారు. సినిమాలో ఎన్నో అవాస్తవాలు చెప్పారన్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications