తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు.!వొడితెల రాజేశ్వర రావు విగ్రహావిష్కరణలో మంత్రి హరీష్ రావు.!

హుజూరాబాద్/హైదరాబాద్ : రాజేశ్వర రావు విగ్రహావిష్కరణ తన చేతుల మీదుగా జరగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రాజేశ్వర రావు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలో తన వ్యాసాల్లో వివరించేవారని మంత్రి హరీష్ రావు గుర్తు చేసారు. హుజూరాబాద్ లో మరో కీలక ఘట్టానికి మంత్రి హరీష్ రావు శ్రీకారం చుట్టారు. హుజూరాబాద్ పట్టణంలో మాజీ ఎంపీ వొడితల రాజేశ్వరరావు విగ్రహావిష్కరణ మహోత్సవానికి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి హరీష్ రావు.

తెలంగాణ గురించి అనేక వ్యాసాలు రాసిన రాజేశ్వర రావు : నిజంగా వొడితెల డీఎన్ఏ లోనే తెలంగాణ జీన్స్ ఉంది అని చెప్పక తప్పదన్నారు. సర్పంచ్ నుంచి ఢిల్లీ దాకా ఎదిగినా తన హుజురాబాద్, సింగాపురంను ఎప్పుడు మరిచిపోలేదన్నారు హరీష్ రావు. లీడర్లు, ప్రజా ప్రతినిధులు, నక్సలెట్లు అంటే భయపడతారని, కానీ నక్సలైట్లు కూడా రాజేశ్వర్ రావును ఇష్టపడేవారనన్నారు.ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఎంతో ప్రేమ ఆప్యాయతతో ఒక అద్భుతమైన కుటుంబ వాతావరణంలో కాలం నెట్టుకొచ్చారని రాజేశ్వర రావు గురించి మంత్రి హరీష్ రావు గుర్తు చేసుకున్నారు. ఒక వైపు డయాలిసిస్ నడుస్తుంటే మరో చేతితో తెలంగాణ ఉద్యమం గురించి రాజేశ్వర రావు వ్యాసాలు రాసేవారని, సీఎం చంద్రశేఖర్ రావు, రాజేశ్వర్ రావు మధ్య ఎనలేని అనుబంధం ఉండేదన్నారు మంత్రి హరీష్ రావు.

harishrao
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన వ్యక్తి రాజేశ్వర్ రావు : సింగపూర్ రాజేశ్వర్ రావు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా, కరీంనగర్, వరంగల్ జిల్లాలకే కాకుండా రాష్ట్రానికి వివిధ హోదాల్లో సేవలందించారన్నారు. కాంగ్రెస్ లో ఉంటూ తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించిన వ్యక్తి అని, తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊపిరిలూదిన వ్యక్తి రాజేశ్వర్ రావు అని మంత్రి హరీష్ రావు కొనియాడారు. ఈ ప్రాంతంలోని 40 గ్రామాల్లో 33 యేండ్ల కిందటేశుద్ధ తాగు జలాలు ప్రజలకు అందించేందుకు ఫిల్టర్ బెడ్ నిర్మించిన వ్యక్తి రాజేశ్వర్ రావు అని హరీష్ రావు గుర్తు చేసారు.

harishrao
నాణ్యమైన విద్య అందించేందుకు రాజేశ్వర రావు కృషి : ప్రజలకు నాణ్యమైన విద్య అందించేందుకు అనతి కాలంలోనే కేజీ టూ పీజీ విద్యాసంస్థలను స్థాపించిన దార్శనికుడు రాజేశ్వర్ రావని మంత్రి హరీష్ రావు అన్నారు. 1990లలోనే ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాలను నెలకొల్పి ఏంతో మంది సాంకేతిక నిపుణలను సమాజానికి అందించిన మహాను భావుడు రాజేశ్వర్ రావు అన్నారు. రాజేశ్వర్ రావు తెలంగాణకు విద్యనందించడంలోనే కాదని, ఉద్యమ వ్యాప్తి లోనూ తన వంతు సహాయ సహకారాలు అందించేవారన్నారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి రాజేశ్వర్ రావు హైద్రాబాద్ నివాసంలో లెక్కలేనన్నీ సమావేశాలు జరిగాయన్నారు మంత్రి హరీష్ రావు.

harishrao
ఢిల్లీ పరిచయాలతో తెలంగాణ భావ వ్యాప్తి : ఢిల్లీలో తనకున్న పరిచయాలను ఆసరా చేసుకుని రాజేశ్వర్ రావు తెలంగాణ భావ వ్యాప్తికి విస్తృతంగా వాడారని, కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ వాదులను సంఘటితం చేసేందుకు చివరిదాకా శ్రమించారన్నారు. లక్ష్మి కాంతరావు టీఆర్ఎస్ లో, రాజేశ్వర్ రావు కాంగ్రెస్ లో ఉన్నా తెలంగాణ కోసం వారిద్దరూ చేసిన మేలు ఎంతో విలువైనదన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ కు ఇక్కడ బలమైన పునాదులు ఏర్పరిచింది వొడితల కుటుంబమే అని చెప్పక తప్పదన్నారు మంత్ర హరీష్ రావు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, తెలంగాణ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు సతీష్ కుమార్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, తెలంగాణ ట్రాన్స్కో జెన్కో సీఎండి ప్రభాకర్ రావు, స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+