హద్దులు దాటిన చాటింగ్.. నగ్న చిత్రాల దాకా: అంతా కలిసి ఆమెను..

Subscribe to Oneindia Telugu
  Online Chat : హద్దులు దాటిన చాటింగ్.. నగ్న చిత్రాల దాకా

  హైదరాబాద్: ఫేస్‌బుక్ స్నేహాలు కొంతమందికి మేలు చేస్తే.. మరికొంతమందిని మాత్రం అనుకోని ఆపదల్లోకి నెడుతున్నాయి. ముఖ్యంగా అమాయక మహిళలు మేక వన్నె పులుల వలలో చిక్కుకుపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌కి చెందిన ఓ వివాహిత కూడా ఇలాగే మోసపోయింది.

   ఇదీ జరిగింది..

  ఇదీ జరిగింది..

  టోలిచౌకికి చెందిన ఓ వివాహిత కొన్నాళ్ల క్రితం ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచింది. ఆమె భర్త జీవనోపాధి రీత్యా దుబాయ్ వెళ్లాడు.

  ఇంటి వద్దే ఉండే సదరు వివాహిత కాలక్షేపం కోసం పలువురితో చాటింగ్ చేసేది. ఆ చాటింగే ఆమె కొంపముంచేదాకా తీసుకొచ్చింది. జుబేర్‌గా ఆమెకు పరిచయమైన ఓ వ్యక్తి ఆమెను అనుకోని కష్టాల్లోకి నెట్టాడు.

   హద్దులు దాటిన చాటింగ్..

  హద్దులు దాటిన చాటింగ్..

  జుబేర్‌తో సదరు వివాహిత రోజూ చాట్ చేయడంతో.. వీరిద్దరూ కాస్త హద్దులు దాటారు. వ్యక్తిగత జీవితం గురించి కూడా చాటింగ్ ద్వారా చర్చించుకున్నారు. వీటిల్లో పలు అభ్యంతరకర విషయాలు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. వాటిని అడ్డుపెట్టుకుని ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టిన జుబేర్.. నగ్న చిత్రాలు పంపించాలని బెదిరించాడు.

   నగ్న చిత్రాలు పంపించాక..

  నగ్న చిత్రాలు పంపించాక..

  ఒకవేళ నగ్న చిత్రాలు పంపించకపోతే.. తన చాటింగ్ లో చర్చించిన అంశాలను ఆమె భర్తకు పంపిస్తానని జుబేర్ హెచ్చరించాడు. బెదిరింపులకు లొంగిపోయిన ఆమె జుబేర్‌కు తన నగ్న చిత్రాలు పంపించింది. అక్కడి నుంచి ఆమెకు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. ఆ ఫోటోలను జుబేర్ మరో ఇద్దరికి షేర్ చేయడంతో.. వారు కూడా ఆమెపై కన్నేశారు.

   అతనూ వంచించాడు..

  అతనూ వంచించాడు..

  జుబేర్ నుంచి ఫోటోలు షేర్ చేసుకున్న ఆ ఇద్దరూ.. ఆమెకు పరిచయస్తులే కావడం మరింత ఇబ్బంది కలిగించింది. దీంతో ఇక ఫేస్ బుక్ ఖాతాను పూర్తిగా తొలగించేయాలని ఆమె భావించింది.

  ఇందుకోసం సమీర్ ఖాన్ అనే ఓ స్నేహితుడి సహాయం కోరగా.. అతనూ ఆమె వంచించాడు. ఆమె నుంచి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తీసుకుని.. ఆమె చాటింగ్స్ లో ఉన్న డేటా మొత్తం కలెక్ట్ చేసుకున్నాడు.

   ఏకంగా ఆమె భర్తకే

  ఏకంగా ఆమె భర్తకే

  ఆ చాటింగ్స్ లో ఆమె నగ్న చిత్రాలు కూడా ఉండటంతో.. వాటిని ఆమె భర్తకు పంపించి డబ్బు కోసం డిమాండ్ చేశాడు. దుబాయ్ నుంచి ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, రూ.5 వేల నగదు పంపించకపోతే... వీటిని సోషల్ మీడియాలో పెడుతానంటూ అతను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.

   ఎట్టకేలకు అరెస్ట్

  ఎట్టకేలకు అరెస్ట్

  సమీర్ ఖాన్ బెదిరింపులతో షాక్ తిన్న ఆమె భర్త.. నేరుగా హైదరాబాద్ వచ్చాడు. భార్యను ఆరా తీస్తే జరిగిందంతా చెప్పింది. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా సిటీ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  దీంతో జుబేర్ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక నిందితుల్లో ఒకరైన సమీర్ ఖాన్ అనే వ్యక్తి దివ్యాంగుడు కావడంతో అతన్ని రిమాండ్‌కు తరలించలేదని పోలీసులు తెలిపారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A married woman in Tolichowki was cheated by facebook friends, they blackmailed with her nude photos

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి