ఎండీఎంఏ డ్రగ్స్ సీజ్, యువతితోపాటు నలుగురి అరెస్ట్: మరో డ్రగ్ గ్యాంగ్ కూడా అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ విక్రయదారులు, సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వినియోగించేవారిపైనా కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా, డ్రగ్స్ కొనుగోలు చేసి విద్యార్థులకు విక్రయిస్తున్న ఓ 21ఏళ్ల యువతిని చాదర్‌ఘాట్ పోలీసులతో కలిసి సౌత్ ఈస్ట్‌టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. ఈ యువతితోపాటు డ్రగ్స్‌ను కొనుగోలు చేసిన నలుగురు విద్యార్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి 8 గ్రాముల ఎండీఎంఏ(MDMA) డ్రగ్స్‌తో పాటు ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని మలక్‌పేట్ ఏసీపీ శ్యాంసుందర్ తెలిపారు. సంతోష్‌నగర్‌కు చెందిన అయేషా పిర్ధోస్ అనే 21 సంవత్సరాల యువతి న్యూ ఇయర్ వేడుకల కోసం ముంబైకి వెళ్లి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయించిందని పోలీసులు తెలిపారు. ఈమె నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన చాదర్‌ఘాట్‌కు చెందిన జాకీరుద్దీన్, సైదాబాద్ లోకాయుక్తా కాలనీ నివాసి మహ్మద్ ఆఫ్రాన్, కుర్మాగూడకు చెందిన ఆయాజ్ ఖాన్, సైదాబాద్ భానునగర్‌కు చెందిన షాబాజ్ షరీఫ్‌లను కూడా అరెస్టు చేసినట్లు ఏసీపీ వివరించారు.

డ్రగ్స్ విక్రయించిన యువతితో పాటు కొనుగోలు చేసిన యువకులు కూడా అందరూ 21 సంవత్సరాల వయస్సు ఉన్నవారేనని, ఇది ఆందోళన కలిగించే విషయమని పోలీసులు అన్నారు. ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చిన అయేషాపై ఇంతకు ముందేమైనా కేసులు ఉన్నాయా?, ఇంకా ఎవరెవరికి విక్రయించిందనే అంశాలపై దర్యాప్తు చేపడుతామని ఏసీపీ శ్యాంసుందర్ పేర్కొన్నారు.
ఇది ఇలావుండగా, నిజామాబాద్ జిల్లాలో కూడా పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి చేపట్టిన వాహన తనిఖీల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. జాతీయ రహదారి 44 పక్కన డిచ్పల్లి మండలం నడిపల్లి తండా వద్ద ఇద్దరు వ్యక్తుల నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను అదనపు డిప్యూటీ కమిషనర్ జయరాం వెల్లడించారు.
డ్రగ్స్‌ను తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్, డిచ్పల్లి పోలీసులు.. వారి వద్ద నుంచి 3.2 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, 12.3 గ్రాముల కొకైన్, 3.1 గ్రాముల గాంజా పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పక్కా సమాచారంతో ఆదివారం రాత్రి నిజామాబాద్ టాస్క్ ఫోర్స్, డిచ్పల్లి పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో డ్రగ్స్ పట్టుబడింది. స్కోడా కారు, మూడు సెల్ఫోన్లతో పాటు డ్రగ్స్ తీసుకునేందుకు వినియోగించే వస్తువులను పోలీసులు సీజ్ చేశారు.












Click it and Unblock the Notifications