మేడారం జాతరలో దుమ్ము రేపుతున్న సీతక్క డ్యాన్స్.. వైరల్ వీడియో!
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గిరిజన కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈసారి మేడారం జాతర మంత్రి సీతక్క పూర్తిగా తన భుజస్కంధాలపై వేసుకుని నడిపిస్తున్నారు. కోట్లాదిమంది భక్తులు తరలివచ్చే ఈ జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పక్కా ప్రణాళికతో మంత్రి సీతక్క ఆదేశాలతో అధికారులు పనిచేస్తున్నారు.
మేడారం జాతర కోసం సీతక్క శ్రమ
జాతరకు నెల రోజుల ముందు నుండి మేడారం లోనే ఉండి పనులను పరిశీలించిన, పర్యవేక్షించిన సీతక్క ఈ జాతరను సక్సెస్ చేయడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రపంచ దేశాలను దృష్టిని ఆకర్షించడం కోసం కూడా సీతక్క తన వంతుగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల న్యూజిలాండ్ దేశ మావోరి తెగకు చెందిన గిరిజనులను మేడారం జాతరకు ఆహ్వానించారు. వారు తమ ట్రైబల్ డాన్సులతో సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు.

సారలమ్మ గుడి వద్ద సీతక్క డ్యాన్స్
ఈ సమయంలో వారితో కలిసి డాన్స్ చేసిన సీతక్క, నిన్న రాత్రి సారలమ్మను గద్దెకు తీసుకొస్తున్న క్రమంలో కూడా సీతక్క పోలీస్ అధికారులతో కలిసి డాన్స్ చేశారు. సారలమ్మను గద్దెపైకి స్వాగతించటానికి కన్నెపల్లిలోని సారలమ్మ గుడికి వెళ్ళిన మంత్రి సీతక్క అమ్మవారి పవిత్ర సన్నిధిలో పోలీసులు, ఆదివాసి గిరిజనులతో కలిసి డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సమ్మక్క, సారలమ్మలపై సీతక్క భక్తి
సమ్మక్క సారలమ్మల జాతర గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఒక ఆదివాసి స్త్రీగా తను సమ్మక్క సారలమ్మల జాతరను ఇంత ప్రత్యేకంగా నిర్వహించుకునే అదృష్టం దక్కించుకున్నారని సీతక్క సంతోషం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. సమ్మక్క సారలమ్మ జాతరను ఒక పండుగగా కాకుండా గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ప్రభుత్వం చూస్తోందని అనేకమార్లు స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో సీతక్క పాట, డ్యాన్స్ వైరల్
మొత్తంగా మేడారం జాతరను ఘనంగా నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్న మంత్రి సీతక్క జాతర వేళ చేస్తున్న హంగామా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకపక్క మేడారం జాతర పాటలతో హోరెత్తిస్తున్న మంత్రి సీతక్క ఇంకో వైపు గిరిజన నృత్యాలతోనూ హల్చల్ చేస్తూ జాతరలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications