మేడారం జాతరకు కేంద్ర మంత్రులు.. వారిముందు మంత్రుల కీలక డిమాండ్!
ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర ఆయన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగుతోంది. కోట్లాదిమంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక మేడారం జాతర కొనసాగుతున్న వేళ రాష్ట్ర, కేంద్ర మంత్రులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. నేడు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిలువెత్తు బంగారాన్ని నివేదించి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
మేడారం జాతరకు కేంద్ర నిధులు
రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు కేంద్ర మంత్రులను, గిరిజన సంప్రదాయాలతో స్వాగతించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేడారం జాతర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ఈసారి జాతరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని కిషన్ రెడ్డి అన్నారు.

మేడారంలో ట్రైబల్ యూనివర్సిటీపై కిషన్ రెడ్డి
ఉభయ తెలుగు రాష్ట్రాలలో రామప్పకు మొట్టమొదటి యునెస్కో గుర్తింపు వచ్చేలా మోడీ ప్రభుత్వం కృషి చేసిందని ఆయన అన్నారు. మేడారం జాతర కోసం భారీగా నిధులు వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.మేడారంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే గిరిజన యువత అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు.
కేంద్ర మంత్రులకు మంత్రుల విజ్ఞప్తి
మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులకు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ వినతిపత్రం ఇచ్చారు. దేశంలోనే ఈ తరహా జాతర ఎక్కడా లేదని, కోట్లాదిగా భక్తులు తరలివచ్చే ఈ జాతరను అరుదైన జాతరగా గుర్తించి జాతీయ హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రులు కేంద్ర మంత్రులకు తెలియజేశారు.
మేడారం జాతరకు జాతీయ హోదా వస్తే అభివృద్ధి
మేడారం జాతరకు జాతీయ హోదా వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఇక్కడ గిరిజన యువతకు ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి కలుగుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. జాతీయ హోదా ఇవ్వడం వల్ల ప్రపంచంలో దృష్టి మేడారం పైన పడుతుందని, విస్తృతమైన ప్రచారం లభిస్తుందని వారన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications