మేడారం మహాజాతరలో నేడే తొలిఘట్టం: మండ మెలిగే పండుగ.. ఏం చేస్తారంటే

ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర, విగ్రహాలు లేని విశిష్టమైన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర జనవరి 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఆదివాసి సంప్రదాయాల ప్రకారం నిర్వహించే మేడారం మహా జాతరలో నేడు మండ మెలిగే పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మండ మెలిగే పండుగతో మేడారం మహా జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది.

మేడారం మహా జాతరకు తొలి ఘట్టం మండ మెలిగే పండుగ
మేడారం మహా జాతరకు ముందు మండ మెలిగే పండుగను నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. గతవారం గుడి మెలిగే పండుగను నిర్వహించగా, నేడు మంద మెలిగే పండుగ నిర్వహిస్తారు. ఇది ఒక పవిత్ర కార్యక్రమం. సమ్మక్క సారలమ్మల ఆలయాలను ఆదివాసి పూజారులు పవిత్ర జలాలతో శుద్ధిచేసే కార్యక్రమం. మండ మెలిగే పండుగ నుండి సరిగ్గా వారం రోజులకు పౌర్ణమి నాడు మేడారం మహా జాతర ప్రారంభం అవుతుంది.

Medaram Maha jathara 2026 Today is first main event Manda Melige panduga interesting

రహస్యంగా ప్రత్యేక ఆచారాలతో సమ్మక్క సారలమ్మల పూజలు
ఇందులో భాగంగా పూజారులు రహస్యంగా ప్రత్యేక ఆచారాలతో సమ్మక్క సారలమ్మల ఆలయాలలో పూజలు చేస్తారు. మేడారంలో సమ్మక్క, కన్నేపల్లిలో సారలమ్మ, పూనుగొండ్ల లో పగిడిద్దరాజు, కొండాయిలో గోవిందరాజుల ఆలయాలలో ఆదివాసీలు పూజలు నిర్వహిస్తారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆలయాల వద్ద పుట్ట మట్టితో అలికి ముగ్గులు వేస్తారు.

మండ మెలిగే పండుగ ఇలా
అంతేకాదు సమ్మక్క, సారలమ్మలు ఉపయోగించిన ఆయుధాలను, గజ్జెలను , కత్తులు కుంకుమ భరిణలు, ఇతర పూజ సామాగ్రిని శుద్ధి చేస్తారు. ఈ మండ మెలిగే పండుగను నిర్వహించే సమయంలో సామాన్యులకు ప్రవేశం ఉండదు. డోలు వాయిద్యాల మధ్య, వీధులు ఆలయ పరిసరాలలో తోరణాలు కట్టి, పండుగ వాతావరణం సృష్టించి మండ మెలిగే పండుగను నిర్వహిస్తారు.

మేడారం చుట్టూ దిష్టి తోరణాలు
అంతేకాదు మేడారం చుట్టూ దిష్టి తోరణాలు కట్టి, గ్రామం చుట్టూ చలిగంజి, అంబలితో కట్టు పోస్తారు. ఆపై సమ్మక్క సారలమ్మలకు సంబంధించిన పూజా సామాగ్రిని మేడారం గద్దెలపై తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. అనంతరం పసుపు కుంకుమలతో పూజలు చేసి కొత్త వస్త్రాలతో గద్దెలను అలంకరిస్తారు. అనంతరం పూజారులు అక్కడే చలమయ్య మొక్కులు కూడా సమర్పిస్తారు.

రాత్రంతా గద్దెల వద్దకు భక్తులు వెళ్ళకుండా ఆదివాసీల జాగారం
అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి, పూజలు పూర్తయిన తర్వాత జాగరణ చేపడతారు . ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజాము వరకు అమ్మవారి గద్దెల వద్దకు భక్తులు ఎవరు వెళ్లకుండా చర్యలు చేపడతారు. మేడారం మహా జాతర ముగిసే వరకు కోయ పూజారులు కఠిన నియమాలను ప్రత్యేక ఆచారాలను పాటిస్తారు. మండ మెలిగే పండుగ తరువాత మేడారం మహా జాతరకు తెర తీసినట్టు అవుతుంది.

మేడారం మహా జాతరలో నాలుగు రోజులు ఇలా
నేడు ఈ తొలి ఘట్టం మండ మెలిగే పండుగ నిర్వహించిన తర్వాత మేడారం మహా జాతర నిర్వహిస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే మేడారం మహా జాతరలో జనవరి 28వ తేదీన కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దె మీదకు ఆగమనం చేస్తారు. 29వ తేదీన చిలకలగుట్ట నుండి కుంకుమ భరణి రూపంలో సమ్మక్క గద్దె మీదకు వస్తారు. జనవరి 30వ తేదీన గద్దెల పైన కొలువైన అమ్మవార్లను భక్తులు దర్శించుకుంటారు. జనవరి 31వ తేదీన నాలుగవ రోజు వన ప్రవేశంతో జాతరను ముగిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+