మీడియానే మంత్రివర్గాన్ని విస్తరించింది.. శాఖలు పంచింది.. వాయిదా వేసింది
తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, పిసిసి నియామకం పైన ఉత్కంఠ కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వాయిదా పడినట్టు కాంగ్రెస్ వర్గాలలో చర్చ నడుస్తుంది. రాష్ట్ర నాయకులు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడినట్టు, మంత్రుల ఎంపికను ఏఐసిసికే అప్పగించినట్టుగా తెలుస్తుంది. అందుకే మంత్రివర్గ విస్తరణ వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి
మంత్రి వర్గ విస్తరణ వాయిదాపై రేవంత్ రెడ్డి
ఇక మంత్రివర్గ విస్తరణ వాయిదా వార్తలపైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మంత్రివర్గ విస్తరణ, పిసిసి నియామకం పైన మరోమారు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణ పైన అధిష్టానం ఇంకా ఏమీ ఖరారు చేయలేదని, ఏఐసిసి అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

మీడియాపై రేవంత్ రెడ్డి సెటైర్లు
మీడియానే మంత్రివర్గ విస్తరణ చేసిందని, శాఖలను పంచిందని ఆపై విస్తరణ వాయిదా కూడా వేసిందని రేవంత్ రెడ్డి మీడియాను ఉద్దేశించి సెటైర్లు వేశారు. బాల్ ఏఐసిసి కోర్టులో ఉందని పేర్కొన్న రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ , తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుని నియామకం అంశాలు ఎందుకు ఆలస్యం అవుతుందనేది ఏఐసిసి అధిష్టానమే చెప్పాలని వ్యాఖ్యలు చేశారు.
పీసీసీ నియామకం, క్యాబినెట్ విస్తరణపై ఏఐసిసిని కోరాం
తాము నూతన పిసిసి నియామకం జరగాలని, క్యాబినెట్ ను విస్తరించాలని ఏఐసిసి అధ్యక్షుడిని కోరుకున్నామని హై కమాండ్ పరిశీలనలో ఈ అంశాలు ఉన్నాయన్నారు. పీసీసీ నియామకం విషయంలో ఏకాభిప్రాయమే ఉందని, నేనే పీసీసీ నియామకం కావాలని అడుగుతున్నానని అన్నారు. ఇక ఇదే సమయంలో బిజెపి, బీఆర్ఎస్ లపైన తీవ్ర విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి.
బీఆర్ఎస్, బీజేపీలపైన సెటైర్లు
బిఆర్ఎస్ పార్టీని టార్చ్ లైట్ వేసుకుని కేసీఆర్ వెతుక్కోవాలంటూ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ కు సింగిల్ సీట్ కూడా లేదని ఎద్దేవా చేశారు. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కూడా ప్రజలు విసుగు చెంది ఇండి కూటమికి ఎక్కువ స్థానాలు కట్టబెట్టారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి మంత్రివర్గ విస్తరణ పైన ప్రస్తుతం జరుగుతున్నదంతా మీడియా సృష్టేనని రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications