మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం: విధులు బహిష్కరించి నిందితుడు సైఫ్‌కు మద్దతుగా ఎంజీఎంలో మెడికోల ఆందోళన

మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో ఎమర్జెన్సీ సేవలు మినహాయించి మిగతా అన్ని సేవలు నిలిపివేసి విధులు బహిష్కరించి నిందితుడు సైఫ్‌కు మద్దతుగా ఎంజీఎంలో మెడికోలు ఆందోళన చేశారు.

వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్ కళాశాల పిజి వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపుల వల్ల ప్రీతి ఆత్మహత్యయత్నం చేసిందని, ప్రీతి తల్లిదండ్రులు ఆరోపిస్తుంటే, పోలీసులు సైఫ్ పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే కేఎంసీలో చదువుతున్న సీనియర్ విద్యార్థులు సైఫ్ కు బాసటగా నేడు ఎంజీఎం ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు.

సైఫ్ కు మద్దతుగా నిలిచిన విద్యార్థులు.. ఎంజీఎంలో విధుల బహిష్కరణ

సైఫ్ కు మద్దతుగా నిలిచిన విద్యార్థులు.. ఎంజీఎంలో విధుల బహిష్కరణ

పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారణంగా భావిస్తున్న సైఫ్ పై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విచారణ పూర్తి కాకుండా తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ ఎంజీఎం ఆస్పత్రిలో అత్యవసర సేవలు మినహాయించి ఓపి, మిగిలిన సేవలను బహిష్కరించారు. సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ కు మద్దతుగా నిలిచిన విద్యార్థులు ఎంజీఎం సూపరింటెండెంట్ కు సమ్మె నోటీసులు అందజేశారు.

ఆస్పత్రి ముందు నిరసన.. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు ఎత్తెయ్యాలని డిమాండ్

ఆస్పత్రి ముందు నిరసన.. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు ఎత్తెయ్యాలని డిమాండ్


అనంతరం విధులను బహిష్కరించి ఆసుపత్రి ముందు బైటాయించి ఆందోళన చేపట్టిన వైద్య విద్యార్థులు, సైఫ్ పై పోలీసులు పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం విచారకరమని పేర్కొన్నవారు, ఇదే సమయంలో సైఫ్ పై అసాధారణమైన కేసులు నమోదు చేయడం సమంజసం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా ఎలా కేసులు పెడతారు అంటూ సీనియర్ మెడికోలు ప్రశ్నించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయొద్దని వారు పేర్కొన్నారు.

సీనియర్లు పని విషయంలో జూనియర్లను మందలించటం సహజమే అంటున్న మెడికోలు

సీనియర్లు పని విషయంలో జూనియర్లను మందలించటం సహజమే అంటున్న మెడికోలు

తమ వృత్తిలో జూనియర్లను సీనియర్లు పని విషయంలో మందలించడం సహజమైనదేనని అది కొత్తేమీ కాదని పేర్కొన్నారు. సైఫ్ పై కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో నిందితుడు మెడికో సైఫ్ ను అరెస్ట్ చేసిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు నేడు ఆయనను కోర్టు ముందు హాజరు పరిచారు. సైఫ్ ఆమెను హేళనగా మాట్లాడారని, గ్రూప్ లో అవమానించినట్టు మెసేజ్ లు పెట్టారని, బ్రెయిన్ లేదా అని అన్నారని, దీంతో ప్రీతి పర్సనల్ గా సైఫ్ కు మెసేజ్ పెట్టారని, తీవ్ర మనస్తాపానికి గురయ్యారని పోలీస్ బాస్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. బాసిజం, ర్యాగింగ్ తరహా ప్రవర్తన వల్లే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేశారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+