మెడికో ప్రీతి కేసు: నేటినుండి 4రోజుల కస్టడీకి సైఫ్.. రిమాండ్ రిపోర్ట్ లో సంచలనాలు!!
పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి కేసులో సైఫ్‌ను నేటి నుంచి 4 రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో సైఫ్ వేధింపులకు సంబంధించిన పలు విషయాలను పోలీసులు ప్రస్తావించారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ కేఎంసీ మెడికల్ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్ పై పోలీసులు నమోదు చేసిన రిమాండ్ రిపోర్టు బయటకు వచ్చింది. ఇది రిపోర్ట్ లో పోలీసులు పలు సంచలన విషయాలను వెల్లడించారు. ఇక మరోవైపు నేటి నుండి నాలుగు రోజుల పాటు సైఫ్ ను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు.

ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్ చేసింది ఇదే
నిందితుడు సైఫ్ నుంచి 17 వాట్సాప్ చాట్ లను పోలీసులు పరిశీలించినట్లు వెల్లడించారు. అందులో అనూష, భార్గవ్, ఎల్డిడీ ప్లస్ నాకౌట్స్ గ్రూప్ చాట్ ను పోలీసులు విశ్లేషించారు. అందులో ముఖ్యమైన విషయాలను గుర్తించిన పోలీసులు అనస్థీషియా డిపార్ట్మెంట్లో సీనియర్ గా ఉన్న సైఫ్ అదే డిపార్ట్మెంట్లో ఉన్న ప్రీతిపై సూపర్ వైజ్ చేసేవాడు. ఈ క్రమంలో అతను ప్రీతి విషయంలో చేసిన రెండు పనులు ప్రధానంగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. డిసెంబర్లో జరిగిన ఒక యాక్సిడెంట్ కేస్ లో సైఫ్ వైద్య విద్యార్థిని ప్రీతిని గైడ్ చేశాడు. అయితే అప్పుడు ప్రీతి ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్టు రాశారు. ఆమె రాసిన రిపోర్టును వాట్సప్ గ్రూప్లో పోస్ట్ చేసిన సైఫ్ ఆమెపై హేళనగా గ్రూప్ లో మెసేజ్ పెట్టారు.

ప్రీతిని సైఫ్ టార్గెట్ చేసిందిలా
ప్రీతికి రిజర్వేషన్ లో ఫ్రీ సీట్ వచ్చిందని, రిజర్వేషన్ లో వచ్చినవారు రిపోర్ట్ రాస్తే ఇలానే ఉంటుందంటూ సైఫ్ పోస్ట్ పెట్టి ఆమెను అవమానించారు. దీంతో నాతో ఏమైనా నీకు ప్రాబ్లం ఉంటే హెచ్ ఓ డి కి చెప్పు అంటూ ప్రీతి సైఫ్ కు వార్నింగ్ ఇచ్చింది. ఇక ఇది సైఫ్ ప్రీతి పై కోపం పెంచుకోవడానికి కారణంగా మారిందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇకపై ఆమెను వేధించాలని భార్గవ్ కు చెప్పాడని, ప్రీతికి ఆర్ఐసీయూలో రెస్ట్ లేకుండా డ్యూటీ వేయాలని సైఫ్ భార్గవ్ కు సూచించాడని పోలీసులు పేర్కొన్నారు.

హెచ్ఓడీకి ఫిర్యాదు చేసిన ప్రీతి,. ఆపై కౌన్సిలింగ్, ప్రీతి ఆత్మహత్య
దీంతో వారి టార్చర్ తట్టుకోలేని ప్రీతి గత నెల 21వ తేదీన హెచ్ఓడీ నాగార్జునకు ఫిర్యాదు చేసింది. దీంతో డాక్టర్లు మురళి, ప్రియదర్శిని, శ్రీకళ సమక్షంలో సైఫ్ కు, ప్రీతికి వారు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత రోజు ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇక ఈ క్రమంలోనే సైఫ్ పై ప్రీతి రిజర్వేషన్ లో వచ్చిందని చేసిన పోస్ట్ నేపథ్యంలో కుల వివక్ష వ్యాఖ్యలుగా పరిగణించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పోలీసులు నమోదు చేశారు. గత నెల 24వ తేదీన సైఫ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.

ప్రీతి ఆత్మహత్య కేసులో సైఫ్ నాలుగు రోజులు పోలీస్ కస్టడీకి
అయితే ప్రస్తుతం ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్ ను విచారించనున్న పోలీసులకు సైఫ్ ను నాలుగు రోజుల కస్టడీకి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ప్రీతి మృతి కేసులో వారం రోజుల కస్టడీకి పోలీసులు పిటిషన్ వేసినా, ఈ పిటిషన్ విచారించిన జిల్లా కోర్టు సైఫ్ ను నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో నేటి నుంచి నాలుగు రోజులు పాటు సైఫ్ ను పోలీసులు విచారించనున్నారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications