మెగాస్టార్ ను మెస్మరైజ్ చేసిన చిన్నారి.! అన్షి చేసిన పనికి ముగ్ధుడైన చిరంజీవి.!
హైదరాబాద్ : అన్షి అనే చిన్నారి తనను మరింతగా ఇన్స్‌పైర్ చేసిందని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి కరోనా రోగుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు అయ్యాయి. ఎంతో మంది పేదలకు ఆక్సిజన్ బ్యాంకుల సేవలు అందుతున్నాయి. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న మెగాస్టార్ చిరంజీవికి ఓ చిన్నారి ఆలోచన మరింత స్తూర్తిదాయకంగా నిలిచిందని మెగాస్టార్ స్పష్టం చేసారు. తన పుట్టినరోజు సందర్భంగా తాను దాచుకున్న డబ్బును చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది ఆ చిన్నారి. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఓ వీడియో ద్వారా తెలియజేశారు.

శ్రీనివాస్, హరిణి దంపతుల చిన్నారి అన్షి ప్రభాల వయసులో చిన్నదైనా ఉన్నత మనస్తత్వాన్ని చాటుకుందని మెగాస్థార్ తన్మయత్వానికి లోనయ్యారు. జూన్ 1న తన పుట్టిన రోజు జరుపుకోవాల్సి ఉంది, ఈ సందర్బంగా తను దాచుకున్న డబ్బుతో పాటు తన ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు అయ్యే ఖర్చు కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తలపెట్టిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల కోసం ఇచ్చింది చిన్నారి అన్షి. ఈ సందర్భంగా తను ఓ సందేశం కూడా ఇచ్చింది. తను చుట్టూ ఉన్న సమాజం బాగున్నప్పుడే అది నిజమైన సంతోషం, సంబరం అవుతుంది అని ఆ చిన్నారి తెలిపింది. అన్షి ఆలోచనకు, మంచి మనసుకు, తను వ్యక్త పరుస్తున్న ఈ ప్రేమకు తాను నిజంగా ముగ్ధుడినపోయానని, అన్షి చూపి స్పందన నా హృదయాన్ని తాకిందని, తనను మరింత ఇన్స్‌పైర్ చేసిందని తెలిపారు చిరు. చిన్నారి డ్రీమ్స్ అన్నీ నిజమవ్వాలని తాను విష్ చేస్తున్నానని, ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని, లవ్ యూ డార్లింగ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆ వీడియోలో తెలియజేశారు.
Recommended Video
What a beautiful gesture Anshi!! I am so touched.
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 1, 2021
You are a wonderful girl. God Bless you!! #AnshiPrabhala #ChiranjeeviOxygenBanks @Chiranjeevi_CT @AlwaysRamCharan pic.twitter.com/VTnQkHNDDP












Click it and Unblock the Notifications