మెగాస్టార్‌కు సోకిన కరోనా: ఇటీవలే కేసీఆర్‌తో భేటీ: నాగార్జునకూ: ఆచార్య షూటింగ్‌లో
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం తాను హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నానని తెలిపారు. చిరంజీవి తన కొత్త సినిమా ఆచార్య షూటింగ్‌లో రోజూ పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రొటోకాల్ ప్రకారం.. సినిమా షూటింగ్‌లో పాల్గొనే సమయంలో ప్రతిరోజూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాల్సి ఉంటుంది.
Recommended Video
ఇందులో భాగంగా ఆయన ఆచార్య షూటింగ్‌లో పాల్గొనడానికి వెళ్లిన సమయంలో కరోనా పరీక్షలను చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు తేలింది. దీనితో ఆయన హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయాలను చిరంజీవి వెల్లడించారు. తనలో కరోనా వైరస్ లక్షణాలేవీ కనిపించలేదని తెలిపారు. అసింప్టోమేటిక్‌గా రిపోర్ట్ వచ్చినట్టు చెప్పారు. తనను కలిసి వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని చిరంజీవి విజ్ఙప్తి చేశారు.

నాలుగైదు రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలను చేయించుకోవాలని అన్నారు. ఇదిలావుండగా.. ఇటీవలే చిరంజీవి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలిశారు. వరద బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి చెక్‌ను కేసీఆర్‌కు ఇచ్చారు. అదే సమయంలో మరో హీరో అక్కినేని నాగార్జున కూడా కేసీఆర్‌ను కలిశారు. ఫలితంగా- కేసీఆర్, నాగార్జునలకు కరోనా వైరస్ సోకుతుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వారిద్దరూ కరోనా నిర్ధారణ పరీక్షలనుచేయించుకోవాల్సిన అవసరం ఏర్పడినట్లు చెబుతున్నారు.
ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను. pic.twitter.com/qtU9eCIEwp
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 9, 2020
-
మీకు అర్థమవుతోందా?.. ‘ధురంధర్2’ తీయడం వెనక పక్కా రాజకీయ వ్యూహం -
థియేటర్ల దగ్గర తొలిసారిగా 144 సెక్షన్, భారీగా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఈ హీరో సినిమాకే -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..! -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే? -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
ఉస్తాద్‌కు ధురంధర్ డెంటు పెట్టేసాడుగా..! -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. హీరో కూడా లేడు !! -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో












Click it and Unblock the Notifications