క్రీడల ద్వారా మనో వికాసం.!విద్యార్థుల కోసం సమ్మర్ క్యాంప్ లంటున్న జీహెచ్ఎంసీ అధికారులు.!
హైదరాబాద్ : ఆధునిక, సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడాకారుల్లో నైపుణ్యతను మరింత పెంపొందించే దిశగా జిహెచ్ఎంసి సమ్మర్ క్యాంప్ లను ప్రతి యేడాది నిర్వహించడం జరుగుతుందని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేసారు. ఈ ప్రత్యేక వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని, వేసవి శిక్షణ శిబిరం సందర్భంగా 44 క్రీడలలో ప్రాచుర్యం పొందిన ఆధునిక క్రీడా లాంగ్ టెన్నిస్ పోటీలు నగర వ్యాప్తంగా ఉన్న క్రీడా మైదానాలలో నిర్వహించడం జరిగిందనగర పాలక సంస్థ అధికారులు చెప్పుకొస్తున్నారు.

ఈ నేపథ్యంలో లాంగ్ టెన్నిస్ క్రీడపై విశేష స్పందన వచ్చిందని, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని లాంగ్ టెన్నిస్ ఆటను ఆస్వాదిస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రత్యేక సమ్మర్ కోచింగ్ క్యాంప్ లు నగర వ్యాప్తంగా ఉన్న 353 క్రీడా మైదానాలు గల 915 ప్రదేశాలలో వివిధ క్రీడలు, ఆటల పోటీలలో 6సంవత్సరాల వయస్సు నుండి 16సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు పాల్గొని క్రమశిక్షణ అలవర్చుకుంటూ క్రీడా స్ఫూర్తి కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.

చందానగర్ పీజేఆర్ స్టేడియం, కె.పి.హెచ్.బి కాలనీ, కూకట్ పల్లి వసంత నగర్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లి టీచర్స్ కాలనీ లోని టెన్నిస్ కోర్టులో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని శిక్షణ పొందుతున్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్ లో భాగంగా గురువారం ఎల్బీనగర్ జోన్ లోని ఉప్పల్ జిహెచ్ఎంసి ప్లే గ్రౌండ్ లో ఇంటర్ ఎస్.ఎస్.సి సెంటర్స్ టోర్నమెంట్స్ నిర్వహించడం జరిగిందని, ఈ టోర్నమెంట్ లో క్రికెట్, క్యారమ్స్, షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ పోటీలు నిర్వహించామని అధికారులు స్పష్టం చేసారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications