Weather Update: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు..!
తెలంగాణలో వచ్చే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. చాలా జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వివరించింది. తూర్పు, ఉత్తర తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, హనుమకొండ, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో భారీగా గాలులు వీస్తాయని పేర్కొన్నారు.
పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడుతోందని.. దీని ప్రభావంతోనే వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే గత వారం రోజులుగా ఏదో చోట వర్షం కురుస్తూనే ఉంది. గురువారం రాత్రి కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. మోతినగర్, బోరంబండ, మదాపూర్, కాకతీయ హిల్స్, ఎస్సాఆర్ నగర్, అమీర్ పేటలో వర్షం కురిసింది. రాత్రి పూట వర్షం కురడవంతో ప్రజలు అంతగా ఇబ్బంది పడలేదు.

ప్రస్తుతం సిటీలో ఆకాశం మేఘావృతమై ఉంది. అప్పుడప్పుడు కాస్త ఎండ వస్తుంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు క్రమంగా బలహీన పడుతున్నాయి. ఇప్పటికే రుతుపవనాల తిరోగమనం మొదలైంది. ఈసారి తెలంగాణలో మంచి స్థాయిలోనే వర్షం కురిసిందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తోంది. వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ అంచనా నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
కాగా తెలంగాణలో ప్రాజెకులన్నీ నిండిపోయాయి. అటు ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే రెండు రోజులు వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications