మెట్రోను సంగారెడ్డి వరకు పొడగించండి: ప్రభుత్వానికి జగ్గారెడ్డి డిమాండ్..

మెట్రో రైలు.. వేగంగా సిటీలోని దూర ప్రాంతాలకు చేరుస్తోంది. సిటీ నుంచి పక్కన గల ప్రాంతాలకు కూడా మెట్రో సేవలను విస్తరించాలనే డిమాండ్ వస్తోంది. తమ ప్రాంతానికి మెట్రో సేవలను విస్తరించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. దీంతో తమ ప్రాంతానికి రవాణా మరింత సులభతరం అవుతోందని చెప్పారు. సిటీలో మెట్రో సేవలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

మెట్రో రైలును మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు పొడిగించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. దీంతోపాటు మిషన్ భగీరథలో కూడా భారీగా అవినీతి జరిగిందని జగ్గారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన జరుగుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అవినీతిలేని పాలన కేవలం కాంగ్రెస్ మాత్రమే అందించిందని జగ్గారెడ్డి తెలిపారు.

metro should be extended to sangareddy: jaggareddy

టీఆర్ఎస్ హయాంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. వారి సాధక బాధకలు ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పారు. పైకి మాత్రం అదీ చేస్తాం.. ఇదీ చేస్తాం అని ఊకదంపుడు ఉపన్యాసాలు మాత్రం ఇస్తారని చెప్పారు. కానీ లోన మాత్రం అదేం లేదని వివరించారు. చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అని వివరించారు.

ఫోటోలు: నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో 72వ గణతంత్ర వేడుకలు: హాజరైన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+