మృతదేహాలనే మార్చేసిన ఎంజీఎం మార్చురీ సిబ్బంది నిర్వాకం
వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీ విభాగంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. రెండు మృతదేహాలను తారుమారు చేసి వారి కుటుంబ సభ్యులకు ఇచ్చి పంపించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వరంగల్ ఎంజీఎం మార్చురీలో రెండు మృత దేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఆపై కట్లు కట్టి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. తీరా ఇంటికి వెళ్లిన తర్వాత కట్లు విప్పి చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆసుపత్రి మార్చురీ సిబ్బంది తమకు ఇచ్చిన మృతదేహం తమ వారిది కాకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే
స్టేషన్ ఘనపూర్ మండలం తానేదార్ పల్లికి చెందిన రాగుల రమేష్ కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో వైద్యులు అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీ తరలించారు. ఇదే క్రమంలో భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన ఆషాడపు పరమేష్ నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా, ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇతని మృతదేహాన్ని సైతం పోస్టుమార్టం నిమిత్తం ఎంజిఎం మార్చురీకి తరలించారు.

ఇరువురి మృతి దేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు పూర్తిస్థాయిలో మృతదేహాలకు కట్లు కట్టి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక మృతదేహాలను తీసుకొని ఇళ్లకు వెళ్లిన సదరు బాధిత కుటుంబాలు రోధిస్తున్న క్రమంలో మృతదేహాల కట్లు విప్పి చూడగా తమ వారి మృతదేహం కాకుండా వేరొకరి మృత దేహం ఉండడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించి మృతదేహాలను మళ్లీ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
తీవ్ర ఆగ్రహానికి లోనైన వారు ఎంజీఎం మార్చురీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపు సిబ్బంది నిర్వాకంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తారుమారైన మృతదేహాలను మళ్లీ ఎవరివి వారికి అప్పగించి వారిని అక్కడనుండి పంపేశారు. ఇక ఈ ఘటనపై ఎంజీఎం పరిపాలనాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications