పేగులు బయటపడ్తయ్ బిడ్డా.. గాడిది కొడుకా?, నువ్వారా అది సాధించేది?: భగ్గుమన్న మంత్రి
మంత్రి బెదిరింపుల నేపథ్యంలో.. మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తానంటున్నారు ములుగు జిల్లా సాధనా కమిటీ అధ్యక్షుడు భిక్షపతి.
భూపాలపల్లి: తనను కాదని జిల్లా సాధనా ఉద్యమాన్ని ముందేసుకున్నాడన్న అక్కసుతో తెలంగాణ మంత్రి అజ్మీరా చందూలాల్.. ములుగు జిల్లా సాధన కమిటీ అధ్యక్షుడు ముంజాల భిక్షపతిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాయలేని భాషలో నానా దుర్భాషాలడుతూ.. ఫోన్ లోనే చిందులు తొక్కారు. 'నువ్వెంత నీ బతుకెంతా.. నేను తలుచుకుంటే నీ పేగులు బయటపడుతయ్' అంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు.
మంత్రి చందులాల్ చేసిన ఈ వ్యాఖ్యలు మీడియాలో గుప్పుమనడంతో.. జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ బాధ్యతాయుతమైన మంత్రి.. ప్రజా ఉద్యమాలు చేసే వ్యక్తుల పట్ల ఇలాగేనా వ్యవహరించేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ములుగు జిల్లా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నందువల్లే మంత్రి ఆయనపై కక్ష గట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మంత్రి చందూలాల్.. ములుగు జిల్లా సాధనా కమిటీ అధ్యక్షుడు భిక్షపతి మధ్య జరిగిన సంభాషణను పరిశీలిస్తే.
మంత్రి చందూలాల్: హలో...
ముంజాల భిక్షపతి: సార్..నేను ముంజాల భిక్షపతిని
మంత్రి: హా.. చెప్పవయ్యా..
భిక్షపతి: బాగున్నారా సార్..
మంత్రి: బాగున్నా.. పెద్దలు కదా.. ఫోన్ చేశారు..
భిక్షపతి: సార్.. మీకన్నా పెద్దోళ్లం కాదు.. మీతోని మాట్లాడతానని మూడు నాలుగుసార్లు ఫోన్ చేసినా..
మంత్రి: బాగా బలిసి ఉన్నరు మీరు.. ములుగు వచ్చి చిల్లరగాళ్లు చిల్లర వ్యవహారం చేస్తున్నరు..
భిక్షపతి: లేదు సార్ మిమ్మల్ని కలుద్దామని..
మంత్రి: నేను తలుచుకుంటే పేగులెల్తయ్.. తొక్కితే...
భిక్షపతి: మీతోని కలుత్తానని ఫోన్ చేస్తున్నా.. అమ్మతోడు మీ పీఏనడగండి..
మంత్రి: ఏం కలుత్తవయ్య నువ్వు.. గాడిది కొడుకువు.. నువ్వు నా మీద స్టేట్‌మెంట్ ఇత్తవ్.. జిల్లా సాధిస్తవా నువ్వు.. ఏందయ్య నీది.. నీ బతుకేందయ్యా.. నువ్వు జానెడ్ లేవు.. నా పిల్లగాడు జూత్తే మండ సంపుతడు..
భిక్షపతి: మీతోని మాట్లాడతనని ఫోన్ చేసినా..
మంత్రి: ఏం మాట్లాడుతవ్ నువ్వు.. లౌ... మాట్లాడేది.. నీతోని నాకు అయ్యేదేంది. నాకు నీతోని జరిగేదేంది. నువ్వు నాకు వ్యతిరేకతై పీక్కునేదేంది.
భిక్షపతి: అట్లేం లేదు సార్.. ఒక్కసారి కలుస్త సార్.
మంత్రి: నువ్వు బలిచిన వ్యవహారం చేయద్దు బిడ్డా.. నకరాలు చేయద్దు.. ఎవల జాగల వాడు బతకాలే.. లేకుంటే మాత్రం నిన్ను ఆదుకునేటోడు ఎవ్వడు లేడు.. వాడు కుమార్‌గాడు సాయిత.. వాని సాయిత... జిల్లా సాధిస్తవురా నువ్వు..
భిక్షపతి: గవాళ్లతోని ఏంది సార్.. గవాళ్లతోని అయితే మీకు ఫోన్ చేస్తనా..
మంత్రి: నువ్వు జిల్లా సాధిస్తవా.. నీ బతుకేందిరా.. నీ బతుకెంత.. ఊళ్లని దోపిడీ చేసి ములుగుకు వచ్చి రాజకీయాలు చేసి నకరాలు చేస్తున్నవా.. నీ బతుకు నాకు తెలువదా..
భిక్షపతి: నా గురించి నీకు తెలవదని నేనన్ననా సార్..
మంత్రి: జిల్లా సాధిస్తవారా నువ్వు నామీద కామెంట్ చేసేటోనివైనావా..
భిక్షపతి: మీరే జిల్లా సాధిస్తరు సార్..
మంత్రి: నీ బతుకెంతరా.. ఎన్ని కథలు చేసినవ్ నువ్వు..
ము: వాస్తవమేగాని సార్..
మంత్రి: నీ బతుకేంది.. నీ వ్యవహారమేంది..? బిడ్డా తలుచుకుంటే.. నువు ములుగులో కూడా ఉండలేవు.
ము: మీరు తలుచుకుంటే ములుగు జిల్లా అయితది.. మాదేమున్నది..
మంత్రి: నువ్వెవ్వడ్రా.. నన్ను అడిగేటందుకు జిల్లా కావాలని..

26వ తేదీ రాత్రి 8గం. సమయంలో మంత్రి చందూలాల్-భిక్షపతిల మధ్య సాగిన సంభాషణ ఇది. ఈ ఆడియో టేపు మీడియాలో లీకవడంతో జిల్లా అంతటా దీని గురించే చర్చ నడుస్తోంది. మంత్రి మాట్లాడిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై మంత్రిని వివరణ కోరేందుకు పలువురు మీడియా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నా.. మంత్రి మాత్రం తన సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి పీఆర్వోను సంప్రదించిన లాభం లేదంటున్నారు.
మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తానంటున్న భిక్షపతి:
మంత్రి బెదిరింపుల నేపథ్యంలో.. మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తానంటున్నారు ములుగు జిల్లా సాధనా కమిటీ అధ్యక్షుడు భిక్షపతి. తనకు మంత్రి నుంచి ప్రాణహాని ఉందని చెబుతున్నారు. రాబోయే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా.. సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించి ములుగు జిల్లా ఏర్పాటుకు హామీ తీసుకోవాలని భావించామని, కానీ మంత్రి మాత్రం తనను చంపుతానని బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చారు.
ములుగు ప్రాంత వాసుల ఆకాంక్షను నెరవేర్చేందుకు రెండున్నర సంవత్సరాలుగా నిస్వార్థంగా ఉద్యమం చేస్తున్నానని భిక్షపతి తెలిపారు. తమ పోరాటంపై ఏమాత్రం ప్రేమ లేని మంత్రి తనను దుర్భాషలాడి చంపుతానని బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించి తనకు రక్షణ కల్పించాలని అన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications