వారందరికీ రూ. లక్ష సాయం: అర్హులైన వారు అప్లై చేసుకోండిలా, 9 నుంచే
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో ప్రతిష్టాత్మక పథకం అమల్లోకి వస్తోంది. రాష్ట్రంలోని బీసీ కుల వృత్తులు, చేతి వృత్తిపదారులకు ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కుల వృత్తులు, చేతి వృత్తులనే నమ్ముకుని జీవిస్తున్నవారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని మే నెలలో జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇందుకు విధివిధానాలను వేగంగా రూపొందించి, లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించే ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.

https://tsobmmsbc.cgg.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోటో, ఆధార్, కుల ధృవీకరణ పత్రం సహా 38 కాలమ్‌లతో సరళమైన అప్లికేషన్‌ను రూపొందించారు. ఈ వెబ్‌సైట్ ద్వారా తక్షణమే దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కులవృత్తి, చేతివృత్తులకు సంబందించిన పనిముట్లు, ముడిసరకు కొనుగోలుకు ఈ ఆర్థిక సాయం అందించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని జూన్ 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే రోజు అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలచే లబ్దిదారులకు రూ. లక్ష పంపిణీ చేయనున్నారు. ఈ కొత్త పథకం అమల్లోకి తీసుకురావడం పట్ల ఆయా కులవృత్తులవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. ప్రభుత్వం అందించే ఈ మొత్తం తమకు ఎంతగానో ఉపయోగడపుతుందని వారు చెబుతున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications