చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరం: మంత్రి హరీష్ రావు

ఏపీ మాజీ సీఎం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఏపీలోని రాజకీయాలపై జాతీయ స్థాయి నేతలు స్పందిస్తున్నారు ఇక చంద్రబాబు అరెస్టు గురించి, చంద్రబాబు అరెస్టు తర్వాత జరుగుతున్న ఆందోళనల గురించి మంత్రి కేటీఆర్ షాకింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి మంత్రి హరీష్ రావు స్పందించారు. చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పాపం ఈ వయసులో ఆయనను అరెస్టు చేయడం మంచిది కాదని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఒకప్పుడు చంద్రబాబు ఐటీ గురించి మాట్లాడారని, ఇటీవల తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి గురించి కూడా మంచి మాటలు చెప్పారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

Minister Harish Rao reacts on Chandrababu arrest

తెలంగాణాలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు తీసుకోవచ్చని చెప్పారని, అంతగా తెలంగాణ అభివృద్ధి చెందిందని చంద్రబాబు చెప్పారని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. కెసిఆర్ పాలన బాగుంది కాబట్టే చంద్రబాబు అలా అన్నారని హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ లేకుంటే కాళేశ్వరం పూర్తి అయ్యేది కాదు అంటూ హరీష్ రావు పేర్కొన్నారు.

రైతుల ఆత్మగౌరవాన్ని ఆదాయాన్ని పెంచిన నాయకుడు కేసీఆర్ అని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన శిశు గృహాన్ని ప్రారంభించిన క్రమంలో మంత్రి హరీష్ రావు చంద్రబాబు అరెస్టుకు సంబంధించి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక శిశు గృహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు శిశు గృహతో మానవీయ కోణం ఆవిష్కృతం అయ్యిందని పేర్కొన్నారు.

శిశు గృహలో అనాధలైన చిన్నారులను పలకరించిన మంత్రి హరీష్ రావు అక్కడ ఉన్న మూడు నెలల చిన్నారికి పేరు పెట్టారు. శ్రీజ అని పేరు పెట్టి ఆ పాప ఎప్పటికీ సంతోషంగా బ్రతకాలని హరీష్ రావు ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలోనే చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+