Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రీతి ఆత్మహత్యాయత్నం బాధాకరమన్న హరీశ్ రావు: దోషులపై కఠిన చర్యలు

పీజీ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం బాధాకరమని అన్నారు.

హైదరాబాద్: పీజీ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం బాధాకరమని అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేపడుతుందన్నారు. దోషులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.

నిమ్స్‌లో చికిత్స పొందుతన్న ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించామని, ప్రత్యేక వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ప్రీతి తల్లిదండ్రులతో మంత్రి హరీశ్ రావు మాట్లాడి ధైర్యం చెప్పారు. నిమ్స్ వైద్యులతో గంట గంటలకు మాట్లాడుతూ.. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి హరీశ్ రావు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

minister harish rao responds on pg medical student preethi suicide attempt issue

ప్రీతిని పరామర్శించిన గవర్నర్ తమిళిసై

ఇది ఇలావుండగా, నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం సాయంత్రం పరామర్శించారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రీతి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. ప్రీతి ఆరోగ్యం విషమంగానే ఉందని తెలిపారు.

వైద్యానికి సహకరించి ప్రీతి త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ కేసులో చాలా పరిణామాలు జరిగాయని.., ఏం జరిగిందనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. స్టూడెంట్స్ అందరూ ధైర్యంగా ఉండాలన్నారు. వైద్యులు ప్రీతికి అన్ని రకాల ట్రీట్‌మెంట్లు అందిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో విచారణ పూర్తిస్థాయిలో పారదర్శకంగా జరగాలని గవర్నర్ తమిళిసై పోలీసులను కోరారు. ప్రీతి చాలా క్లెవర్ స్టూడెంట్ అని విన్నాను.. ఆమె ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమని గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో ఈ కేసులో దర్యాప్తు జరగాలన్నారు.

మరోవైపు, ప్రీతిని వేధింపులకు గురిచేసిన ఆమె సీనియర్ విద్యార్థి, నిందితుడు సైఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి ముందు ఏం జరిగిందన్న దానిపై సైఫ్ ను విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో సైఫ్.. ప్రీతిని వేధించినట్లు ఆధారాలు లభించినట్లు తెలిసింది. ప్రీతిని అవమానించే విధంగా సైఫ్.. వాట్సాప్ సందేశాలు పంపాడని గుర్తించారు.

కాగా, సైఫ్ వేధించడం వల్లే తన కూతురు ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుందని మొదట్నుంచి ఆమె తండ్రి చెబుతున్నారు. ఈ విషయంపై కాలేజీ ప్రిన్సిపాల్ తోపాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినా ఫలితం లేకపోవడంతో తన కూతురు ఆత్మహత్యాయత్నం చేసిందని కన్నీటిపర్యంతమయ్యారు. ప్రీతి సోదరుడు కూడా సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందన్నాడు. వైద్యులు ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించాడు.

minister harish rao responds on pg medical student preethi suicide attempt issue

ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని నిమ్స్ వైద్యులు వెల్లడించారు.ప్రీతి నిమ్స్‭లో జాయిన్ అయ్యేటప్పటికే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉందని వైద్యులు చెప్పారు. ప్రీతిని వెంటిలేటరీ అయానోట్రోపిక్ సపోర్టుతోనే నిమ్స్‭కు తరలించారని అన్నారు. ప్రస్తుతం కార్డియాక్, శ్వాస కోశ సమస్యలు ఉన్నాయని చెప్పారు. స్పెషలిస్ట్ వైద్యుల సహాయంతో ఎక్మో చికిత్స అందిస్తున్నామని నిమ్స్ డాక్టర్లు తెలిపారు. మరోవైపు ప్రీతిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉష పరామర్శించారు.

సైఫ్ వేధింపుల కారణంగా బుధవారం హానికరమైన ఇంజెక్షన్ తీసుకోవడంతో ప్రీతి కోమాలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. కాగా, నిందితులను శిక్షించాలంటూ పలు పార్టీలకు చెందిన నేతలు నిమస్ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీతికి న్యాయం జరిగే వరకూ ఆందోళన చేస్తామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+