కవిత లేఖ ఆర్టిఫీషియల్, ఇదీ జరిగిందీ..!!

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్సీ కవిత తాజాగా కేసీఆర్ రాసిన లేఖ పైన ఆయన స్పందించారు. ఈ లేఖ రాజకీయంగా కలకలం రేపుతోంది. పాజిటివ్ అంశాలతో పాటుగా నెగటివ్ అంశాలను కవిత ఈ లేఖలో ప్రస్తావించారు. ప్రధానంగా బీఆర్ఎస్ - బీజేపీ పొత్తు అంశం పైన కవిత చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఈ లేఖ పైన స్పందించలేదు. బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి చేసిన విశ్లేషణ ఆసక్తి కరంగా మారుతోంది.

కవిత రాసిన లేఖ సంచలనంగా మారిన వేళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కవిత పేరుతో కేటీఆర్, హరీష్ కలిసి ఈ లేఖ రాసారని ఆరోపించారు. ఆ లేఖకు, కవితకు సంబంధమే లేదని అన్నారు. లెటర్ ఆలోచన ఎలా వచ్చిందో, ఎక్కడ ప్లాన్ వేశారో తనకంతా తెలుసునని, ఆర్టిఫీషియల్ లేఖను కూడా సరిగా రాయలేకపోయారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ తో కలుస్తుందని, 20 లేదా 30 సీట్లలోనే బీఆర్ఎస్ పోటీ చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్ కుటుంబంలో కలహాలు అనేది పెద్ద డ్రామా అని, వందేళ్ళయి నా కేసీఆర్ కుటుంబం కలిసే ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.

minister-komatireddy-reacts-on-kavitha-letter-to-kcr

తనకు కవిత గురించి ఆలోచించే సమయం లేదన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కడ ఉంటుం దని ప్రశ్నించారు. వరంగల్‌లో కేసీఆర్ పెట్టిన సభ తాను ఒక్కడినే పెట్టగలనని.. వాట్సాప్‌లో మెసేజ్ పెడితే... తన కోసం పది లక్షల మంది వస్తారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖపై డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకమని, ఈ కుట్రలో భాగమే కవిత లేఖ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని ఒక ముఖ్య నాయకుడు.. ఈ లేఖ వెనక ఉన్నారని ఆమె ఆరోపించారు. తండ్రికి కూతురు లేఖ రాయా ల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్‌ను కలిసే పరిస్థితి కూడా కవితకు లేదా అని అన్నారు. అసలీ లేఖ కవిత రాసిందేనా.. రాస్తే ఎలా బయటకు వచ్చింది.. ఎవరు రిలీజ్ చేసారని డీకే అరుణ ప్రశ్నించారు. తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీయేనని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+