మా అమ్మ నిజమైన లీడర్!
తెలంగాణా మంత్రి కొండా సురేఖ తాజాగా తమ ఫ్యామిలీ ఫంక్షన్ లో ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో బీర్లు, బిర్యానీలు, మందు పార్టీ అంటూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పు పడుతూ దేవాదాయ శాఖా మంత్రి మాట్లాడే మాటలేనా ఇవి అంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు
ఇక ఈ వివాదంపైన స్పందించిన మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు ఎంతో ప్రత్యేకమైన తన కూతురు 14 వ పుట్టిన రోజు సందర్భంగా సంతోషాన్ని నా తల్లితో ఇన్ స్టా గ్రామ్ లైవ్ లో పంచుకున్నాను అని పేర్కొన్న సుస్మిత తన తల్లి ఓ గొప్ప నాయకురాలన్నారు. ఆమె అనుచరులు, సిబ్బంది ఆవిడ పట్ల ఎనలేని గౌరవాభిమానాలు కలవారని పేర్కొన్నారు.

పర్సనల్ పార్టీపై విమర్శలా.. కొండా సుస్మిత అసహనం
ఈ సందర్భంగా వారి కోసం ఓ పర్సనల్ పార్టీ ఏర్పాటు చేయాలనుకున్నారు. వారి సంతోషం కోసం ఏర్పాట్లు చేశారని తెలిపారు.
ఆ పార్టీలో మా సిబ్బందితోపాటు తన కుమారుడు కూడా పార్టీని ఆస్వాదిస్తున్న విషయాన్ని గమనించవచ్చన్నారు. అది కుటుంబ పార్టీ, బహిరంగంగానే జరిగింది తప్ప అందులో రహస్యమేమీ లేదన్నారు. అయినా కూడా కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
దేవాదాయ శాఖా మంత్రి అయితే వ్యక్తిగత జీవితం ఉండదా?
వాళ్లందిరికీ ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. అదేమీ రేవ్ పార్టీ కాదు, అందులో మత్తు పదార్ధాలు వినియోగించలేదని కొండా సుస్మిత పేర్కొన్నారు. అది ఒక ఫ్యామిలీ పార్టీ అంతేనన్నారు. తన తల్లికి సంబంధించినంతవరకు తనకు తన పిల్లలతో పాటు సిబ్బంది కూడా అంతే సమానం అని పేర్కొన్న కొండా సుస్మిత దేవాదాయ శాఖ మంత్రి అయినంత మాత్రాన తన వ్యక్తిగత జీవితాన్ని తనకోసం పనిచేసే సిబ్బంది బాగోగులు చూడకూడదని లేదన్నారు.
కొండా సురేఖ నిజమైన లీడర్ అన్న కొండా సుస్మిత
తన సిబ్బంది సంతోషం, గౌరవాభిమానాలను కాపాడేవారే నిజమైన నాయకులని, తన తల్లి కూడా నిస్సందేహంగా నిజమైన లీడర్ అని పేర్కొన్నారు. అధికారం చెలాయించడం కాదు మనతో నడిచేవారి బాగోగులు చూసిన వాళ్లే నిజమైన నాయకులు అని తన తల్లి ఎప్పుడూ చెప్తుంటారన్నారు కొండా సురేఖ.
ఇందులో తప్పేంటి? కొండా సుస్మిత సూటి ప్రశ్న
ఈ సందర్భాన్ని విమర్శించే వారికి తాను వేసే సూటి ప్రశ్న ఇందులో తప్పేంటి? అని ప్రశ్నించారు. ఇతరుల అభిప్రాయాల్ని గుర్తించి గౌరవించడమే నాయకత్వ లక్షణమై ఉండాలి తప్ప విమర్శించడం కాదన్నారు. సంతోషం, విశ్వాసమే పటిష్టమైన బంధాలను ఏర్పరుస్తాయి తప్ప విమర్శలు కాదన్నారు.












Click it and Unblock the Notifications