మెగాస్టార్ చిరంజీవిని కలిసిన మంత్రి కొండా సురేఖ.. ఎందుకంటే!
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్లో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసంలో మర్యాదపూర్వకంగా ఆయనను కలిసిన కొండ సురేఖ ఆయనతో కాసేపు ఆత్మీయ సంభాషణ చేశారు. తన కుమార్తె కొండా సుస్మిత తో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లిన మంత్రి కొండా సురేఖ, చిరంజీవికి ఇష్టమైన ఆంజనేయస్వామి చిత్రపటాన్ని బహూకరించారు.
చిరంజీవిని కలిసిన కొండా సురేఖ పోస్ట్
చిరంజీవిని కలిసిన అనంతరం సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్ట్ పెట్టారు. మాజీ కేంద్రమంత్రి సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి గారిని మా కుమార్తె కొండా సురేఖతో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని కొండా సురేఖ ఆ పోస్టులో వెల్లడించారు. అయితే కొండా సురేఖ చిరంజీవిని ఎందుకు కలిసింది అన్నదానికి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

కొండా సురేఖ వెళ్ళింది ఇందుకేనా
చిరంజీవికి ఇటీవల మనవడు, మనవరాలు ట్విన్స్ పుట్టిన నేపథ్యంలో, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసే ఉద్దేశంతో ఆయన ఇంటికి కొండా సురేఖ వెళ్ళినట్టుగా అభిమానులు భావిస్తున్నారు. అంతేకాదు చిరంజీవి కాపు సామాజిక వర్గం కావడంతో ఒక బీసీ మంత్రిగా చిరంజీవికి సన్నిహితంగా ఉండే ప్రయత్నంలో భాగంగానే వెళ్లి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసేవారు లేకపోలేదు.
సురేఖ పోస్ట్ లపై నెటిజన్ల ఆసక్తి
కొండా సుస్మిత చిరంజీవి వీరాభిమాని కావడంతో ఆమె తల్లితో కలిసి వెళ్లి ఉంటుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కాంట్రవర్సీ లకు కేరాఫ్ అయిన మంత్రి కొండా సురేఖ ఏం చేసినా దానిని నిశితంగా గమనిస్తున్నారు నెటిజన్లు, ప్రజలు.
చిరంజీవికి తాజాగా మరో శుభవార్త
ఇదిలా ఉంటే ఇటీవల చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ సినిమా సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఈ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న చిరంజీవికి తాజాగా మరో శుభవార్త అమితానందాన్ని కలిగించింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించడం మొదట బాబు, తర్వాత పాప జన్మించడం చిరంజీవి కుటుంబానికి చాలా సంతోషాన్ని కలిగించింది. ఇక చిరంజీవికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి మంత్రి కొండా సురేఖ ఆయన ఇంటికి వెళ్లినట్టు సమాచారం.
-
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
రాజకీయ వారసురాలు.. గ్లామర్ తార.. రామ్చరణ్ బ్యూటీని చుట్టుముట్టిన వివాదం! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
పెళ్లి కంటే సహజీవనం బెస్ట్: మెగా హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ -
కొత్త బిజినెస్ షురూ చేసిన తెలుగు యాంకర్..! -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..!












Click it and Unblock the Notifications