పబ్లిక్ గా మంత్రి కొండా సురేఖ షాకింగ్ వ్యాఖ్యలు.. వైరల్ వీడియో!

ప్రజా ప్రతినిధులుగా పనిచేస్తున్న వారు ప్రజలందరికీ ఆదర్శంగా ఉండాలి. వారు మాట్లాడే మాటలు, వారి చేతలు ప్రజలు మెప్పును పొందేలా ఉండాలి. అయితే ప్రస్తుత రాజకీయాల్లో మాత్రం అటువంటి పరిస్థితులు లేవు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు ముఖ్యంగా మంత్రులుగా కొనసాగుతున్న వారు కూడా ఒక్కొక్కసారి చేస్తున్న పనులు మాట్లాడుతున్న మాటలు వారి చేష్టలు సభ్య సమాజం నివ్వెరపోయేలా చేస్తున్నాయి.

మళ్ళీ వివాదంలో కొండా సురేఖ
ఇలాంటి వారినా మనం అధికారం కట్టబెట్టి కూర్చోబెట్టామనే చర్చకు దారితీస్తున్నాయి. ఇక తాజాగా తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన మంత్రి కొండా సురేఖ విషయానికి వస్తే నిన్నటిదాకా కొండ సురేఖ సమంత, నాగచైతన్య విడాకులపై వివాదాస్పదమైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలువగా, తాజాగా తన ఇంట్లో నిర్వహించిన ఒక శుభకార్యం తాలూకా విందులో ఆమె చేసిన వ్యాఖ్యలతో మళ్ళీ ఆమె వివాదాలలో చిక్కుకున్నారు.

Minister Konda Surekha shocking comments in live New headache with viral video

బిర్యాని ఉన్నప్పుడు, బీరు ఉంటుందని మంత్రి వ్యాఖ్యలు
తన కుమార్తె కొండా సుస్మిత తో ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో మంత్రి సురేఖ ఇంట్లో జరుగుతున్న ఒక పార్టీ గురించి మాట్లాడుతూ బిర్యాని ఉన్నప్పుడు, బీరు ఉంటుందని, ఎవరు ఎక్కువ డాన్స్ చేస్తే వారికి ఎక్కువ మందు అంటూ వ్యాఖ్యలు చేశారు. అఫీషియల్ వేడుకలు వేరు అక్కడ అఫీషియల్ గా ఉండాల్సి ఉంటుంది.

వరంగల్ లో కొండా మురళి, హైదరాబాద్ లో సురేఖ మందు పారిస్తున్నారంటూ
అనఫిషియల్ సెలబ్రేషన్స్ వేరు అంటూ మాట్లాడిన కొండ సురేఖ ఓవైపు బిర్యానీ అవుతుంది. ఇంకోవైపు చల్లబడడం అవుతుందని మనం కూడా తాగుడు నేర్చుకుంటే అయిపోవంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక ఆమె వ్యాఖ్యలతో పార్టీ శ్రేణులకు కొండా సురేఖ తన ఇంట్లో పార్టీ ఇస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇక ఈ వీడియోలో కొండా సుస్మిత ఇది లైవ్ అని మాట్లాడుతూ వరంగల్లో కొండా మురళి హైదరాబాద్లో కొండా సురేఖ మందు పారిస్తున్నారన్నారు.

మంత్రి పబ్లిక్ గా బీర్లు, బిర్యానీల వ్యాఖ్యలు.. టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్
సుస్మిత చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా బీరు, బిర్యానీ తెప్పిస్తున్నానని కొండా సురేఖ చెప్పడం కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కొండా సురేఖ తాజా వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తుంది. ఓ దేవాదాయ శాఖ మంత్రి, అందునా ఒక మహిళా మంత్రి పబ్లిక్ గా లైవ్ గా బీర్లు, బిర్యానీ ల గురించి, మందు పార్టీల గురించి మాట్లాడడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సభ్య సమాజానికి మంత్రి ఇస్తున్న సందేశం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+