అమ్మ, నాన్న కోరిక నెరవేర్చలేకపోయా: మంత్రి కేటీఆర్!!
తెలంగాణలో 9 మెడికల్ కళాశాలలను ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తో కలిసి వర్చువల్ గా ప్రారంభించిన విషయం తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్ అక్కడ నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన చదువుకు సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
1993లో తాను కూడా బైపిసి పూర్తి చేసినట్టు పేర్కొన్న కేటీఆర్ మా నాన్న నన్ను ఐఏఎస్ చేయాలని అనుకునే వారిని, అమ్మకు డాక్టర్ కావాలని కోరిక ఉండేదని పేర్కొన్నారు. అప్పట్లో తనకు ఎంసెట్లో 1600 ర్యాంకు వచ్చినా మెడికల్ సీట్ రాలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. తాను అమ్మా నాన్న కోరిక నేరవేర్చలేకపోయానని, రాజకీయ నాయకుడిని అయ్యానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

కానీ ఇప్పుడు విద్యార్థులు చాలా అదృష్టవంతులని, తెలంగాణలో పదివేల మంది వైద్యులు ప్రైవేటు మరియు ప్రభుత్వ వైద్య కళాశాలల నుండి ప్రతీ ఏడాది బయటకు వస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. డిగ్రీ కళాశాల కోసం కొట్లాడే పరిస్థితి నుంచి ఈరోజు మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, నర్సింగ్ కళాశాల, అగ్రికల్చర్ వంటి పెద్ద పెద్ద కళాశాలలు తెలంగాణలో వచ్చాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ధాన్యం ఉత్పత్తి లోనే కాదు డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలంటే నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అన్నట్టు పరిస్థితులు ఉండేవని కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారాయన్నారు.
గత పాలనలో రెండే రెండు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే, తొమ్మిదేళ్లలో కేసీఆర్ 21 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని, వచ్చే సంవత్సరంలో 8 కళాశాలలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications