రజినీకాంత్, లయ వ్యాఖ్యలు గుర్తుచేసి హైదరాబాద్ పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని స్పష్టం చేశారు. బేగంపేటలోని ధనియాల గుట్టలో ఆధునిక వైకుంఠధామం ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ భూతలస్వర్గంగా మారిందని తాను చెప్పడం లేదని పేర్కొన్న మంత్రి కేటీఆర్,కానీ హైదరాబాద్ ను అభివృద్ధి చేసే విషయంలో చిత్తశుద్ధితో పని చేస్తున్నామని స్పష్టం చేశారు.నగరం విశ్వనగరంగా ఎదగాలంటే అద్భుతమైన ఫ్లైఓవర్లు, ప్రజా రవాణా వ్యవస్థ ఉండాలని, 24 గంటల కరెంటు, మంచినీటి సరఫరా వ్యవస్థ తదితర మౌలిక సదుపాయాలన్నీ ఉండాలని పేర్కొని,తొమ్మిదేళ్లలో హైదరాబాద్ మహానగరం మనందరం గర్వపడే విధంగా తయారయిందా లేదా అంటూ ప్రశ్నించారు.

ఇక ఇటీవల హైదరాబాద్ నగరాన్ని ఉద్దేశించి సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రశంసలు గుప్పించారు అని హైదరాబాద్ కు వెళితే..ఇండియాలో ఉన్నామా? న్యూయార్క్ లో ఉన్నామా అన్నట్టుగా ఉంటుందని రజనీకాంత్ చెప్పారని పేర్కొన్నారు.
సినీ నటి లయ సైతం హైదరాబాద్ ను ఉద్దేశించి హైదరాబాద్ లో ఉంటే లాస్ఏంజిల్స్ లో ఉన్నట్టు అనిపిస్తుందని చెప్పారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇదంతా అధికారంలో ఉన్న బి ఆర్ ఎస్ కృషి వల్లే జరిగిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అంతేకాదు హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పామని, సమస్యలు లేవని కాదు అని పేర్కొన్నారు కేటీఆర్ .

మనిషి ఉన్నంత కాలం సమస్యలు కూడా ఉంటాయని, అమెరికాలో అయినా హైదరాబాద్ లో నైనా సమస్యలు కామన్ గా ఉంటాయని చెప్పారు. విశ్వ నగరం అయినంత మాత్రాన అసలు ఉండవని కాదని ఆయన పేర్కొన్నారు. కానీ చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరిస్తూ,హైదరాబాద్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.
హైదరాబాద్ లో అన్ని నాలాలను అభివృద్ధి చేస్తున్నామని, డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తున్నామని, లక్ష డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టాలని, వాటిని కూడా ఈ 4 నెలల్లోనే అందిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ వరద బాధితుల కోసం ఆరు వందల అరవై కోట్ల రూపాయలను సహాయంగా అందించామని పేర్కొన్న ఆయన కేంద్రం నయాపైసా ఇవ్వలేదని పేర్కొన్నారు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications