పవన్ కల్యాణ్ పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు - భయపడే ప్రసక్తే లేదు..!!
జనసేనాని పవన్ కల్యాణ్ పైన మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలోనూ తమ పార్టీ పోటీచేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడగలరని చెప్పుకొచ్చారు. ప్రజలు అనుకుంటే ఏమైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ జగన్, లోకేశ్..పవన్ తో ఉన్న సంబంధాల గురించి వివరించారు. మోడీ అయినా.. మరెవరైనా. భయపడే ప్రసక్తే లేదని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామని పేర్కొన్నారు.

పవన్ అన్న లాంటి వాడు
ఏపీ రాజకీయాలపైన మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో రాజకీయాల పైన స్పందించారు. తనకు పవన్ మంచి ఫ్రెండ్ గా కేటీఆర్ పేర్కొన్నారు. తనకు అన్న లాంటి వాడని చెప్పారు. పలు సందర్భాల్లో కలుసుకున్నామని..అనేక విషయాలు మాట్లాడుకున్నామని వెల్లడించారు. అనేక అంశాల్లో తమ అభిరుచులు కలుస్తాయని కేటీఆర్ వివరించారు. పవన్ కు సాహిత్యం అంటే ఇష్టమని చెప్పిన కేటీఆర్...తనకు కూడా సాహిత్యం అంటే కొంత ఆసక్తి ఉందన్నారు. తనకు అందరూ స్నేహితులేనని కేటీఆర్ చెప్పుకొచ్చారు. రాజకీయాలకు..స్నేహలకు సంబంధం లేదన్నారు.
జగనన్న మంచి ఫ్రెండ్
ఏపీలో నారా లోకేశ్ కూడా తనకు బాగా తెలుసని చెప్పారు. ఎవరి రాజకీయాలు వారివి అని వివరించారు. తన రాజకీయాలు తనవి అని పేర్కొన్నారు. సీఎం జగనన్న తనకు మంచి ఫ్రెండ్ అని కేటీఆర్ చెప్పారు. తనకు ఎవరితోనూ ఎటువంటి ఇబ్బందులు లేవని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఏపీలో తమ పార్టీ బీఆర్ఎస్ పోటీ చేస్తుందని కేటీఆర్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు పోటీ పడుతున్నాయని..పార్లమెంట్ లో మాత్రం అన్ని పార్టీలు బీజేపీతోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ఏపీ ప్రయోజనాల కోసం
ఏపీ ప్రయోజనాలు కేసీఆర్ మాత్రమే కాపాడగలరని అక్కడి ప్రజలు భావిస్తే ఏదైనా జరగచ్చని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాష్ట్ర హక్కులు సాధించే శక్తి కేసీఆర్ కు ఉందని ఏపీ ప్రజలు భావిస్తే ఎన్నికల్లో ఏదైనా జరిగే అవకాశం ఉంటుందన్నారు. కేసీఆర్ లాంటి ఫైటర్ ను ప్రజలు ఎప్పటికైనా ఆదరిస్తారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తమకు లాలూచీ రాజకీయాలు తెలియవని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మోదీ అయినా..ఎవరైనా భయపడే ప్రసక్తే లేదన్నారు. నిరంతరం ప్రజల తరపున కోట్లాడుతూనే ఉంటామని కేటీఆర్ తేల్చి చెప్పారు.
-
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !!











Click it and Unblock the Notifications