వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన.. అభివృద్ధి పనుల జాతర; షెడ్యూల్ ఇలా!!

రాష్ట్ర ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పర్యటనకు బీఆర్ఎస్ పార్టీ నేతలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ పర్యటన మొత్తం వారి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో సాగనుంది.

రేపు వరంగల్ కు రానున్న మంత్రి కేటీఆర్ పట్టణప్రగతి, సిఎంఏ, మునిసిపల్ సాధారణ నిధులు, స్మార్ట్ సిటీ, స్టేట్ గవర్నమెంట్ ఫండ్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, ఫ్లడ్ రిలీఫ్ పథకాల క్రింద రూ.12819 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న 17అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. వరంగల్ మహానగరపాలక సంస్థ, కుడా, ఇతర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన సుమారు రూ 178.95 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

 ktr

జిడబ్ల్యూ ఎంసీ ఆధ్వర్యంలో సిఎంఏ, స్మార్ట్ సిటీ పథకాల క్రింద రూ. 520 లక్షల తో చేపట్టిన 2 అభివృద్ధి పనులైన మోడల్ వైకుంఠ ధామం , సైన్స్ పార్క్ లను, తెలంగాణ స్టేట్ సైన్స్ టెక్నాలజీ కౌన్సిల్ నిధులతో రూ 850 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎస్సి , ఎస్టీ సెంటర్ లకు ప్రారంభోత్సవాలు చేస్తారు.

అదేవిధంగా భద్రకాళి మాడ వీధులు, రూ 120 లక్షలతో అంతర్గత సిసి రోడ్ లకు శంకుస్థాపన, బిసి సంక్షేమ శాఖ నిధులతో 31 వ డివిజన్ లో రూ 586 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న బిసి కమ్యూనిటీ హాల్ లకు మంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు. రేపు మంత్రి కేటీఆర్ పర్యటన మధ్యాహ్నం భోజన విరామం తర్వాత నుండి వరంగల్లో ప్రారంభమవుతుంది.

 ktr

వరంగల్ కిట్స్ కళాశాల మైదానానికి కేటీఆర్ మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఇంక్యుబేషన్ సెంటర్, ఎగ్జిబిషన్ తిలకిస్తారు. విద్యార్థులతో ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. కెసిఆర్ కప్ ప్రైజ్ ప్రధానోత్సవం చేస్తారు. అనంతరం 4:30 నిమిషాలకు హనుమకొండ కు చేరుకుని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

ఆపై ఐదు గంటలకు లష్కర్ బజార్ లో ప్రభుత్వ హైస్కూల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహిస్తారు. అనంతరం 5 గంటల 30 నిమిషాలకు వరంగల్ లోని నాయుడు పెట్రోల్ పంప్ వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భూమి పూజ నిర్వహిస్తారు. ఆపై 6 గంటల 15 నిమిషాలకు గాంధీ నగర్ లోని మోడల్ వైకుంఠధామం ప్రారంభిస్తారు. అనంతరం కాజీపేటలోని సెయింట్ గాబ్రిల్ స్కూల్లో పార్టీ సమావేశంలో పాల్గొంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+