రజాకార్ సినిమా టీజర్ పై మంత్రి కేటీఆర్ ట్వీట్.. బండి సంజయ్ ఘాటుగా సెటైర్!!
తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో రజాకార్ సినిమా టీజర్ పొలిటికల్ కాంట్రవర్సీకి వేదికగా మారుతుంది. ఈ సినిమాపై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందించారు.
సెప్టెంబర్ 17వ తేదీ సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రజాకార్ సినిమా టీజర్ ను సినిమా బృందం విడుదల చేసింది. ఇక టీజర్ పై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించగా, కేటీఆర్ ట్వీట్ పై బిజెపి ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రివర్స్ ఎటాక్ చేశారు. ఒకరిపై ఒకరు ఆరోపణల వర్షం కురిపించారు.

ఈ మూవీపై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ రాష్ట్రంలో తమ రాజకీయ ప్రచారం కోసం మత హింసను ప్రేరేపించటానికి బిజెపికి చెందిన కొంతమంది మేధావులు, దివాలా తీసిన జోకర్లు తమ శాయశక్తుల కృషి చేస్తున్నారని, తెలంగాణ శాంతిభద్రతల పరిస్థితి దెబ్బతినకుండా చూసేందుకు సెన్సార్ బోర్డు తో పాటు తెలంగాణ పోలీసుల దృష్టికి కూడా మేము ఈ విషయాన్ని తీసుకువెళతామని మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
అయితే కేటీఆర్ ట్వీట్ పై స్పందించిన బండి సంజయ్ ఆయనకు రివర్స్ కౌంటర్ వేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని మొదటి వాగ్దానం చేసిన వారు ఇప్పుడు ట్రాక్ మార్చి తెలంగాణ సమైక్యత దినోత్సవాన్ని జరుపుతున్నారని మండిపడ్డారు. తాజాగా రజాకర్ల వాస్తవాలను చూపించినప్పుడు ట్విట్టర్ టిల్లుకు ప్రాబ్లం గా ఉందని మండిపడ్డారు.
ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని పేర్కొన్న ఆయన, వినాయక చవితి పండుగ రోజు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పకుండా రజాకర్ల హిందూ మారణ హోమాన్ని చూపించిన సినిమాపై దాడి చేయాలని కేటీఆర్ నిర్ణయించుకున్నాడని ఎద్దేవా చేశారు. చరిత్రను తుడిచిపెట్టే పనికిమాలిన ప్రయత్నాలకు బదులు ట్విట్టర్ టిల్లు కు కొంత స్పృహ కలిగించమని అందరం గణేశుని ప్రార్థిద్దాం అంటూ బండి సంజయ్ తనదైన శైలిలో టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications