మీ డీఎన్ఏ.. మీరు, మీ కుటుంబం! కవిత వర్సెస్ సీతక్క హాట్ హాట్‌గా

తెలంగాణ శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ వాడీవేడిగా జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి సీతక్క మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రాష్ట్ర పరువుతు తీస్తున్నారంటూ కవిత విమర్శలు చేశారు. దీంతో మంత్రి సీతక్క ఆమె వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు . రాష్ట్ర పరువు తీసింది ఎవరు అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే అవినీతి ఉందంటూ కవిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ కుటుంబమే రాస్ట్ర పరువు తీసింది. మాకు ఢిల్లీ వ్యాపారాలు తెలియవు. ఢిల్లీ వ్యాపారాలతో రాష్ట్రం పరువు తీసింది మీరు, మీ కుటుంబం అని కవితనుద్దేశించి సీతక్క విమర్శించారు. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర అన్నారు.

Minister Seethakka counters Kavitha s comments in Telangana Legislative Council

కరప్షన్‌కి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ అని సీతక్క విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఐదేళ్లలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని గుర్తు చేశారు. మహిళా కమిషన్‌కి సభ్యులు లేరు.. మహిళలు పొదుపు చేసుకున్న 1800 కోట్ల అభయహస్తం నిధులు ఇవ్వలేదు.. పావలా వడ్డీ ఇవ్వలేదు. మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన రూ. 3700 కోట్ల వడ్డీలు చెల్లించలేదని సీతక్క ఆరోపించారు.

తెలంగాణను బీఆర్ఎస్ సర్కారు సస్యశ్యామలం చేస్తే.. రైతులు ఎందుకు ఇబ్బందులు పడ్డారని మంత్రి ప్రశ్నించారు. తాము పంట కాలువలు మూసివేసినట్లుగా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఇష్టానుసారం ఎస్టిమేషన్స్ పెంచి దోచుకున్నారిన ఆరోపించారు. మీరు నోటిఫికేషన్లు వేస్తే నియామకాలు ఎవరు అడ్డుకున్నారని కవితను మంత్రి ప్రశ్నించారు.

బీఆర్ఎస్ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో తాము చేస్తున్నామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత 59 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. పదేళ్లలో పేదలకు ఎన్ని ఇళ్లు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజలకు ఏం చేయలేదనే వారు తమను అధికారంలోకి కూర్చోబెట్టారని మంత్రి సీతక్క అన్నారు. తాము అధికారంలోకి వచ్చి 15 నెలలే అయిందని.. అప్పుడే అన్నీ అయిపోవాలంటూ అక్కసు వెల్లగక్కుతున్నారని మండిపడ్డారు.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లను పథకాలకు పెడితే తప్పేంటని కవితను సీతక్క ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఉద్యోగ భృఇస్తామని ఇవ్వలేదు.. ఇలా అనేక హామీలను తుంగలో తొక్కింది బీఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. పదేళ్ల అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేయలేదని బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. ఇలాంటి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటూ హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+