నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా చెప్తున్నా
తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావుపై రాష్ట్ర మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం (అక్టోబర్ 16) జరిగిన క్యాబినెట్ సమావేశంపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఆమె తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేసి ఖండించారు.
క్యాబినెట్‌లో ఎలాంటి రాద్ధాంతం జరగలేదు. కేవలం ఎజెండా, ప్రజా సమస్యలపై మాత్రమే చర్చ జరిగింది. అబద్ధాలు ప్రచారం చేసి హరీష్ రావు నీచమైన స్థాయికి దిగజారిపోయారు. ఆయన తన ఆరోపణలను నిరూపించగలరా? అంటూ సీతక్క సవాలు విసిరారు.

అబద్ధానికి ఆరడుగుల సాక్ష్యం హరీష్ రావు అని ఘాటుగా విమర్శించిన సీతక్క, రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చింది బీఆర్ఎస్సే అని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో రోడ్లపై అడ్వకేట్లను చంపిన ఘటనలను గుర్తు చేస్తూ, దండుపాళ్యం, దండుకున్న పాళ్యం బీఆర్ఎస్సే అంటూ ఎద్దేవా చేశారు.
ఇంట్లో వాళ్ళ మీద ప్రమాణం చేసి మరి చెప్పగలను - సీతక్క #Seethakka #Harishrao #KTR #PoliticsToday #Telangana #OITelugu pic.twitter.com/UIouEwzOhn
— oneindiatelugu (@oneindiatelugu) October 17, 2025
సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన అందిస్తుంటే, కేసీఆర్ మాత్రం ఫాంహౌస్‌కు పరిమితమయ్యారని విమర్శించారు. కేసీఆర్ కుమార్తె కవిత చేసిన ఆరోపణలపై కూడా హరీష్ రావు సమాధానం చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. మంత్రి సీతక్క ఇచ్చిన ఈ పదునైన కౌంటర్లతో తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి రాజుకుంది.












Click it and Unblock the Notifications