కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొత్తు వ్యాఖ్యలకు మంత్రి తలసాని స్ట్రాంగ్ కౌంటర్; కిషన్ రెడ్డికి సవాల్!!
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పొత్తులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణాలో వచ్చే ఎన్నికలలో ఎవరికి సరైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని, హంగ్ ఏర్పడుతుందని కెసిఆర్ కాంగ్రెస్ తో కలవక తప్పదని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలలోనే కాకుండా బిఆర్ఎస్ నేతల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కోమటిరెడ్డి వ్యాఖ్యల ప్రకంపనలు తెలంగాణాలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కోమటిరెడ్డి మాటలు అర్థం లేనవి
తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు అర్థం లేనివని, కోమటిరెడ్డి పూటకో మాట మాట్లాడే నాయకుడని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. కోమటిరెడ్డి మాటల్లో విశ్వసనీయత ఉండదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, బీఆర్ఎస్ ఏ రాజకీయ పార్టీ పైన ఆధారపడబోదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన తలసాని
వచ్చే ఎన్నికలలో తమకు పూర్తి మెజారిటీ వస్తుందని, అన్ని వర్గాల ప్రజల మద్దతుతో హ్యాట్రిక్ సాధిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన సవాల్ పైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చకు వస్తానని చెబుతున్నారని, అంబర్ పేట, సికింద్రాబాద్ కు చేసిన అభివృద్ధి గురించి చెప్పాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.

కిషన్ రెడ్డివి తాడు బొంగరం లేని మాటలు
అంబర్ పేటలో చేసిన అభివృద్ధిపై చర్చించడానికి మా పార్టీ ఎమ్మెల్యే రెడీగా ఉన్నారని కిషన్ రెడ్డి రెడీనా అంటూ సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు తాడు బొంగరం లేని వ్యాఖ్యలని మండిపడ్డారు. ఇక ఇదే సమయంలో ఈటెల రాజేందర్ గురించి వ్యాఖ్యలు చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈటల రాజేందర్ బిఆర్ఎస్ లోకి వస్తారా లేదా అనేది ఆయనకే తెలియాలని పేర్కొన్నారు.
తెలంగాణ సెక్రటేరియట్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, సెక్రటేరియట్ కట్టడం గొప్పతనం భవిష్యత్తులో అందరికీ తెలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలు చేశారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications