నటుడు ఫిష్ వెంకట్‌కు మంత్రి శ్రీహరి పరామర్శ.. ఆదుకుంటామని హామీ !
తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్.. ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషయంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. ఇప్పటికే ఐసీయూలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచిన ఆయనకు అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నారు.
మంత్రి శ్రీహరి పరామర్శ..
ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు ( జూలై 7, 2025 ) ఆసుపత్రికి వెళ్లి ఫిష్ వెంకట్‌ను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఫిష్ వెంకట్ మంచి నటుడు అని.. తెలంగాణ యాసను వెండితెరపై తనదైన శైలిలో చూపించి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని.. ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మద్యం అలవాటు వల్లే..
వెంకట్ గతంలో కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. షుగర్, కాలుకు ఇన్‌ఫెక్షన్ కారణంగా అతని ఆరోగ్యం గణనీయంగా క్షీణించింది. నాలుగేళ్ల క్రితం జరిగిన శస్త్రచికిత్స వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఆయనకు.. అప్పట్లో సినీ ప్రముఖులు, అభిమానులు, దాతల నుండి విరాళాలు వచ్చాయి. కానీ ఆపరేషన్ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది.
వెంకట్ భార్య మాట్లాడుతూ.. ఆపరేషన్ తర్వాత మద్యం, సిగరెట్‌లను వదలమన్నా వినలేదు. కొంతమంది స్నేహితులే ఇంటికి వచ్చి మళ్లీ అలవాటు చేయడమే కాక, ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో ఉన్నా కూడా ఎవ్వరూ చూడటానికి రావడం లేదు. కుటుంబం ఒంటరిగా పోరాడుతోంది అని బాధను వ్యక్తం చేశారు.
సినీ ప్రస్థానం..
ఫిష్ వెంకట్ తెలుగు సినిమాల్లో కామెడీ విలన్‌గా తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2002లో వీవీ వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 'ఆది' సినిమాలో "తొడకొట్టు చిన్నా" అనే డైలాగ్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించారు. ఆ తర్వాత వరుసగా బన్నీ, రెడీ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, మనం, బృందావనం, అతడు వంటి అనేక చిత్రాల్లో నటించారు. ఆయన తన పాత్రల్లో విలనిజాన్ని కామెడీ టచ్‌తో మిళితం చేస్తూ ప్రేక్షకులను నవ్వించగలిగారు. ఫిష్ వెంకట్ త్వరగా కోలుకుని మళ్లీ తెరపై కనిపించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications