తెలంగాణలో అనూహ్య ఫలితం, ఆశలు గల్లంతు - ప్రముఖ సర్వే లేటెస్ట్ రిపోర్ట్..!!
తెలంగాణ ఎన్నికల ఫలితాల పై అనూహ్య లెక్కలు బయటకు వస్తున్నాయి. పోలింగ్ ముగిసిన తరువాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ లో మెజార్టీ అభిప్రాయం కాంగ్రెస్ కు అనుకూలంగా కనిపించింది. ఈ ఎగ్జిట్ పోల్స్ ను బీఆర్ఎస్ వ్యతిరేకించింది. ఎగ్జాక్ట్ పోల్స్ లో తమదే విజయమని బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టం చేస్తోంది. ఈ సమయంలో మిషన్ చాణక్య ఒక రోజు ఆలస్యం బయట పెట్టింది. ఈ సర్వేలో ఆసక్తికర అంశాలను విశ్లేషించారు. తెలంగాణలో హంగ్ తప్పదని ఈ తాజా సర్వే స్పష్టం చేసింది.
తెలంగాణలో 119 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరనేది ఇప్పుడ ఉత్కంఠ పెంచుతోంది. 2018 ఎన్నికల కంటే మూడు శాతం తక్కువగా 70.79 నమోదైంది. పోలింగ్ సరళి అన్ని పార్టీలకు పజిల్ గా మారింది. కాంగ్రెస్ తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ గెలుపు పైన విశ్వాసం వ్యక్తం చేసారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుందని..ప్రత్యర్ది పార్టీల గెలుపు ఓటమలును డిసైడ్ చేస్తోందనే విశ్లేషణలు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ వార్ రూమ్ లు పోలింగ్ సరళి గురించి క్షేత్ర స్థాయి సమాచారం సేకరించారు. ప్రతీ నియోజకవర్గంలో పోలింగ్ తీరును విశ్లేషించారు. అంతిమంగా తమకే కలిసి వస్తుందని చెబుతున్నారు.

ఇక, ఇప్పుడు చాణక్య ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించింది. రాష్ట్రంలో నెలకొన్న హోరాహోరీ పోరు కారణంగా మరింత స్పష్టంగా ప్రజానాడి తెలుసుకొనేందుకు ప్రయత్నించామని సర్వే నిర్వాహకులు వివరించారు. అన్ని కోణాల్లోనూ ప్రజల మూడ్ తెలుసుకొనే ప్రయత్నం చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ సర్వే అంచనా ప్రకారం ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రావటం లేదు. బీఆర్ఎస్ కు 43-55, కాంగ్రెస్ కు 35-48, బీజేపీకి 06-10, ఎంఐఎం కు 7 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. దీంతో..రెండు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ - కాంగ్రెస్ అధికారానికి దూరంలోనే ఆగిపోతాయని తేల్చేంది. దీంతో. బీజేపీ, ఎంఐఎం రెండు పార్టీలు ఈ సారి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాయని అర్దం అవుతోంది.
బీజేపీ ఎవరికీ మద్దతు ఇచ్చేది లేదని చెబుతోంది. బీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతుగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. దీంతో, ఈ సర్వే లెక్క ప్రకారం బీఆర్ఎస్ -ఎంఐఎం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్సు ఎక్కువగా ఉందనే అంచనాలు ఉన్నాయి. దీంతో..కాంగ్రెస్, బీఆర్ఎస్ కాకుండా హంగ్ దిశగా ఈ సర్వే నివేదిక ఇవ్వటంతో ఇప్పుడు తుది ఫలితాల పైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications