అంబర్‌పేట ఎమ్మెల్యే వెంకటే‌ష్‌పై మహిళా కార్పొరేటర్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్: రాష్ట్రంలో అధికార పార్టీ అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఖమ్మం, పాలమూరు, తదితర ప్రాంతాల్లో నేతల మధ్య విభేదాలు బయటపడగా.. తాజాగా, హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలోనూ అలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. అయితే, ఎమ్మెల్యే తనపై దాడి చేశారంటూ అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ ఆరోపించడం గమనార్హం.

అంబర్‌పేటలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా స్థానిక నేతలు ఆ ప్రాంతంలోని పూలే విగ్రహానికి నివాళులర్పించారు. మొదటగా గోల్నాక కార్పొరేటర్ లావణ్య తన కార్యకర్తలతో కలిసి పూలే విగ్రహం వద్దకు వెళ్లారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.. లావణ్యను పక్కకు నెట్టేశారు.

MLA Kaleru Venkatesh Golnaka corporator Lavanya clash

అంతటితో ఆగకుండా అందరిముందు ఆమెను బెదిరించారు. దీంతో లావణ్య అవమానకరంగా భావించి కంటతడి పెట్టారు. ఆ తర్వాత మీడియాతో ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఓ మహిళతో ఇలా ప్రవర్తించడం సబబేనా అని ప్రశ్నించారు. తాను పూలే విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే వెంకటేష్ తనను భుజంపై కొట్టారని లావణ్య తెలిపారు. అనంతరం అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై తనను బెదిరించారని కన్నీటిపర్యంతమయ్యారు.

తాను కార్పొరేటర్‌గా ఎన్నికైనప్పటి నుంచి ఎమ్మెల్యే వెంకటేష్ తనపై కక్ష సాధిస్తున్నారని లావణ్య తెలిపారు. తమ డివిజన్ పరిధిలో అభివృద్ధి జరగకుండా నిధులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని ఆమె వాపోయారు. దళితబంధు పథకం కింద లబ్ధిదారుల వివరాలను అందించగా.. అవి పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు.

ఓ ప్రజాప్రతినిధి అయిన తన పట్లే ఎమ్మెల్యే ఇలా ప్రవర్తిస్తే ఇక సాధారణ ప్రజల పరిస్థితేంటి? అని కార్పొరేటర్ ప్రశ్నించారు. కాగా, ఎమ్మెల్యే బెదిరింపులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+