బీజేపీకి రాజాసింగ్ రాజీనామా - మీకు, మీ పార్టీకో దండం..!!
తెలంగాణ బీజేపీలో మరో భారీ కుదుపు. పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల వేళ రాజాసింగ్ ఈ ప్రకటన చేసారు. అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు వచ్చిన తన మద్దతు దారులను బెదిరించారని రాజాసింగ్ ఆరోపించారు. ముందుగానే నిర్ణయించి అధ్యక్షుడిని ప్రకటించారని చెప్పుకొచ్చారు. కిషన్ రెడ్డి పైన రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. తన రాజీనామా లేఖ సమర్పిస్తున్నట్లు చెప్పారు. తన రాజీనామా ఆమోదించాలని కోరినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే గా రాజీనామా పైన స్పీకర్ కు లేఖ పంపాలని కోరారు.
తాను కొన్నేళ్లుగా పార్టీలో ఇబ్బందులు పడుతున్నానని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనేది తన కోరిక అని చెప్పారు. అయితే, పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారికి ప్రాధాన్యత దక్కుతుందని ఆరోపించారు. కాగా.. రాజాసింగ్ కొంత కాలంగా పార్టీలో జరిగే నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో ముఖ్య నేతలు లక్ష్యంగా వ్యాఖ్యలు చేసారు.

ఇప్పుడు తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా.. అవకాశం ఇవ్వకపోటం పైన ఆయన ఆగ్రహం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. రాజాసింగ్ కొంత కాలంగా పార్టీ వీడుతారనే ప్రచారం సాగుతోంది. సీఎం రేవంత్ ను అభినందిస్తూ.. పలు సందర్భాల్లో రాజాసింగ్ మాట్లాడటం పార్టీ నేతలకు రుచించటం లేదు.
The silence of many should not be mistaken for agreement.
— Raja Singh (@TigerRajaSingh) June 30, 2025
I speak not just for myself, but for countless karyakartas and voters who stood with us with faith, and who today feel let down.
Jai Shri Ram 🚩 pic.twitter.com/JZVZppknl2
ఇక, ఇప్పుడు రాజాసింగ్ ఎమ్మెల్యే పదవి లో కొనసాగుతారా లేదా అనేది సస్పెన్స్ గా మారుతోంది. ఈ రోజు ఖరారు చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి పైన రాజాసింగ్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన సీనియార్టీ పట్టించుకోవటం లేదనే ఆవేదనతో రాజాసింగ్ ఉన్నట్లు గా పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు రాజాసింగ్ పార్టీ నేతల పూన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను బీజేపీకి రాజీనామా చేసానని చెబుతున్న రాజాసిం్.. హిందుత్వం కోసం పోరాటం చేస్తానని ప్రకటించారు. తాను, తన కుటుంబం టెర్రరిస్టు ముప్పుతో ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా పై పార్టీ ఏం చేయబోతోందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications