MLC Kavitha ఎఫెక్ట్: కేసీఆర్ ఊహించనంతగా బీఆర్ఎస్ పార్టీకి భారీ డ్యామేజ్!!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే గత తెలంగాణ ఎన్నికల్లో ఓటమిపాలై డీలా పడిన బీఆర్ఎస్ పార్టీలో కవిత అరెస్టుతో చోటుచేసుకున్న పరిణామాలు పార్టీ నుండి చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయేలా చేస్తున్నాయి. అసలే ఓటమి బాధలో ఉన్న అధినేత కేసిఆర్ కు ఇప్పుడు కూతురు కవిత విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు మింగుడు పడనివిగా ఉన్నాయి.

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు
ఒకపక్క లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే కవిత విషయంలో జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ పార్టీ నేతలను అభద్రతా భావానికి గురిచేస్తున్నాయి.ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తుంటే మరోవైపు ఈడి అరెస్టు చేసిన కవితను, మళ్ళీ సిబిఐ అధికారులు అరెస్టు చేయడం అన్ని వైపుల నుండి కవితను ఇరకాటంలో పెడుతుండడం బీఆర్ఎస్ పార్టీకి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా మారింది.

MLC Kavitha effect huge damage to BRS party than KCR expected

కలవరపడుతున్న బీఆర్ఎస్ నేతలు
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితను ఈడి అరెస్టు చేసిన తర్వాత దీనిని మేనేజ్ చేయడం బీఆర్ఎస్ నేతలకు తలనొప్పిగా తయారైంది . ఇప్పుడు ఇక ఈ వ్యవహారంలో సిబీఐ కూడా ఎంటర్ కావడంతో బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తు పరిణామాలు ఎట్లా ఉంటాయన్నది అందరినీ ఆలోచించేలా చేస్తుంది. బీఆర్ఎస్ నేతలను కలవరానికి గురి చేస్తుంది.

సీబీఐ ఎంట్రీతో వణికిపోతున్న బీఆర్ఎస్
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో కవిత ప్రధాన నిందితురాలని ఢిల్లీ, హైదరాబాద్ లో ఈ స్కామ్ కు స్కెచ్ వేసింది కవితనేనని 100 కోట్ల రూపాయలను సమీకరించి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఇచ్చినట్టు సిబిఐ ఆరోపించింది. అంతేకాదు కవితను విచరించడానికి ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కూడా కోరింది. ఇక ఈ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీ నేతలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

కవితతో బీఆర్ఎస్ పార్టీకి భారీ డ్యామేజ్
ఇప్పటికే కవిత అరెస్టు పార్టీకి విపరీతమైన డ్యామేజ్ చేయగా తాజాగా సిబిఐ కూడా రంగంలోకి దిగడంతో పార్టీ మరింత అప్రతిష్టపాలవుతుందని ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి కవిత కారణంగా దెబ్బ తగులుతుందేమో అని పార్టీ నేతలు భయపడుతున్నారు. బెయిల్ పై బయటకు రావాలని ప్రయత్నం చేస్తున్న కవితకు ఏ మాత్రం వెసులుబాటు దక్కనివ్వకుండా దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగిస్తున్న క్రమంలో కవిత ఎఫెక్ట్ పార్టీ పై భయంకరంగా పడుతుందనే టాక్ వినిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+