తెలంగాణలో మరో మూడురోజులపాటు భారీ వర్షాలు: ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు వీడటం లేదు. ఒకటిరెండు రోజులు తెరపినిచ్చినా.. ఆ తర్వాత మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి.హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించింది. అయితే రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు, అలర్ట్

తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు, అలర్ట్

రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో కూడిన ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. భారీ వర్షాల నేపథ్యంలో ఐఎండీ ప్రజలకు సూచనలు జారీ చేసింది. చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని సూచించింది. పిడుగులు పడుతున్నప్పుడు చెరువులు, సరస్సులు, ఇతర నీటి వనరులకు దూరంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలిన తెలిపింది. ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగించవద్దు. పడిపోయిన విద్యుత్ లైన్ల నుంచి దూరంగా ఉండాలని సూచించింది.

ఆదివారం ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఆదివారం ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఆదివారం హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, ములుగు, యాదాద్రి భువనగిరి, జనగాం, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నిర్మల్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

ఆగస్టు 1న జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఆగస్టు 1న జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, జోగుళాంబ గద్వాల్, వనపర్తి, సిద్దిపేట, నారాయణపేట, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి
జిల్లాలకుఆగస్టు 1న ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

ఆగస్టు 2,3 తేదీల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఆగస్టు 2,3 తేదీల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఆగస్టు 2వ తేదీన పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, (ఖమ్మం, నల్గొండ, నల్గొండ, నల్గొండ, నల్గొండ, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహాబూబ్ సూర్యపేట, వరంగల్, రూరల్), వరంగల్ (అర్బన్), జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు 3న ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+